హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో  అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడిస్తున్నాయి.   పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి . హుజూర్ నగర్ ఉప ఎన్నిక లో  టిఆర్ఎస్ దే విజయమని ఆరా , చాణక్య  సంస్థ లు ప్రకటించాయి .  టిఆర్ఎస్ కు  50 . 48  శాతం,  కాంగ్రెస్ కు  39  . 95 శాతం  ఇతరులకు 09 . 57 శాతం విజయ అవకాశాలున్నాయని వెల్లడించింది . హుజూర్ నగర్ లోని అన్ని మండలాల్లో టిఆర్ఎస్ కే మొగ్గు ఉన్నట్లు  తమ సర్వేలో తేలినట్లు ఆరా సంస్థ తెలిసింది.  టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి  15 వేల మెజార్టీతో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది .


 ఇక మిషన్  చాణక్య సర్వే ప్రకారం  టిఆర్ఎస్ 53  , కాంగ్రెస్ 41,  బిజెపి 1 . 1 శాతం,   విజయావకాశాలు ఉన్నాయని   ప్రకటించింది.  హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నామని టీఆరెస్  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు . టిఆర్ఎస్ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు ,  నాయకులకు అయన ధన్యవాదాలు తెలిపారు.  పార్టీ విజయం కోసం గత నెల రోజుల్లో కష్టపడిన కార్యకర్తలకు ట్విట్టర్ వేదిక గా కేటీఆర్  కృతఙ్ఞతలు చెప్పారు .


 టీఆరెస్ వైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మొగ్గు చూపిస్తున్నప్పటికీ , కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం తమ అభ్యర్థి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు . హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు . పోలింగ్ ముగిసే సమయానికి 80  శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: