ఏపీలో నవయుగ సంస్ధకు తగులుతున్న వరుస షాక్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా ఉండే నవయుగ సంస్ధకు తొలుత పోలవరం కాంట్రాక్టు రివర్స్ టెండరింగ్ తో షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు కృష్ణపట్నం సెజ్ భూముల రద్దుతో కోలుకోలేని దెబ్బతీసింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా సెజ్ ఏర్పాటు కోసం ఇచ్చిన నాలుగు వేల ఏడు వందల ఎకరాల భూములను పనులు జరగడం లేదన్న కారణంతో జగన్ సర్కారు రద్దు చేయడం వెనుక పెద్ద వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది.


నాలుగు సంవత్సరాల క్రితం పోలవరం ప్రాజెక్టు పనులను తమ పార్టీకే చెందిన ఎంపీ రాయపాటి సాంబ శివ రావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ నుంచి తప్పించి నవయుగ ఇంజనీరింగ్ కు టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఇచ్చింది. ట్రాన్స్ ట్రాయ్ కు ఈపీసీ విధానంలో పనులు అప్పగించిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత నవయుగకు మాత్రం ఎల్ఎస్ విధానంలో పనులు కట్టబెట్టింది.


టీడీపీ ప్రభుత్వం పోవడానికి ముందు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే నవయుగ సంస్ధ పోలవరం పనులు నిలుపుదల చేసింది. ప్రభుత్వం మారితే బిల్లులు రావన్న భయమో, మరే కారణమో తెలియదు కానీ నవయుగ మాత్రం పనులు నిలిపేసింది. దీంతో తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు నిర్ణీత సమయంలో పనులు చేయలేదనే కారణంతోనే నవయుగను ఏకంగా కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ ప్రీ క్లోజర్ నోటీసులు ఇచ్చింది జగన్ ప్రభుత్వం. 


ఆ తర్వాత పోలవరం ప్రధాన డ్యాము పనుల నుంచి తమను తప్పించడంపై స్పందించని నవయుగ సంస్ధ, హైడల్ ప్రాజెక్టు విషయంలో మాత్రం హైకోర్టును ఆశ్రయించి స్టే తెచుకున్నారు. అయినా జగన్ సర్కారు ఇవేవీ పట్టించుకోకుండా రెండు ప్రాజెక్టులకూ రివర్స్ టెండరింగ్ కు వెళ్లి అనుకున్న ఫలితాన్ని బాగానే రాబట్టింది. అంతే కాదు ఈ కాంట్రాక్టు రివర్స్ టెండరింగ్ లో సైతం నవయుగ అసలుకే పాల్గొనలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: