ఇండియా, పాకిస్తాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చాలా కనిపిస్తున్నాయి. పీవోకే లోని ఉగ్రస్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసిన తర్వాత ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం గట్టిగా జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ వ్యవహరిస్తున్న తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్ట్రాంగ్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను అన్నిటిని ధ్వంసం చేస్తామని, అవసరమైతే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళీ మరీ టెర్రరిస్టులను ఏరివేస్తామని స్పష్టం చేశారు అయన.


ఆదివారం పీవోకోలేని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసిన భారత ఆర్మీ శ్రేణులు శతఘ్నులతో విరుచుకుపడింది. నీలం వ్యాలీలోని నాలుగు టెర్రరిస్టుల లాంచ్ ప్యాడ్‌లపై దాడులు జరిపి వాటిని ధ్వంసం చేసింది. భారత ఆర్మీ దాడుల్లో ఆరు నుంచి పది మంది పాకిస్తాన్ సైనికులు, సుమారు 40 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.


అంతకుముందు తాంగ్‌ధర్ సెక్టార్‌ ల వద్ద భారత్‌ లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ఒక సారి ప్రయత్నించారు. అదే సమయంలో భారత దళాల దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ సైన్యం కాల్పులు కూడా జరిపింది. పాక్ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు, ఒక పౌరుడు చనిపోయారు. పాకిస్తాన్ కాల్పులను తిప్పికొట్టిన భారతదేశ  ఉగ్రవాదుల చొరబాట్లను గట్టిగా అడ్డుకుంది. అదే సమయంలో నీలం వ్యాలీలో ఉన్న టెర్రర్ లాంచ్ ప్యాడ్‌ లను టార్గెట్ చేసి శతఘ్నులతో వాటిని కూడా ధ్వంసం చేసింది.


నిజానికి పాకిస్థాన్ చాలాసార్లే వాటి ఉల్లంఘనలను దాటింది. వారి సైన్యం చాలా సార్లు భారత భూభాగంలోకి చొరబడడం పరి పాటిగా మారింది. ఇటివల జరిగిన సర్జికల్ స్ట్రైక్ తర్వాత కూడా పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడడం కొనసాగిస్తూనే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: