ఈవీఎంలో దేనికి ఓటు వేసినా అది బీజేపీకే పడుతుందిన సంచలన వ్యాఖ్యలు చేసిన హర్యానా బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ  వ్యాఖ్యానించారు.బీజేపీలో ఆయనే అత్యంత నిజాయితీపరుడు అని రాహుల్ ట్వీట్ చేశారు. ఒక వైపు హర్యానాలో పోలింగ్ జరుగుతుండగా హర్యానా బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను రాహుల్ పోస్ట్ చేశారు.

అసంధ్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే బక్షిత్ సింగ్ విర్క్ ప్రసంగిస్తూ.మీరు ఎవరికి ఓటేస్తున్నారో మాకు తెలియదనుకోకండి.మీరు ఎవరికి ఓటేస్తున్నారో మాకు ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రధాని మోదీ, సీఎం ఖట్టర్ చాలా తెలివైన వారు అంటూ ఆయన పంజాబీలో మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా వైరల్ గా మారాయి. మీరు ఎవరికి ఓటేసినా, అది కమలం గుర్తుకే వెళుతుంది,అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఈసీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది .

ఏ బటన్ నొక్కినా ఓటు కమలానికే వెళ్తుంది అని హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి బక్షిష్‌ సింగ్‌ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదం అయాయి.ఈ వివాదంపై స్పందించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. బక్షిష్ సింగ్ మాట్లాడిన వీడియోను ట్వీట్‌ చేస్తూ.. బీజేపీలో అత్యంత నిజాయతీపరుడు ఈయనే అని పేర్కొన్నారు. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో హరియాణా ఎన్నికల ప్రధాన అధికారి అనురాగ్‌ అగర్వాల్‌ స్పందించి,ఘటనపై విచారణ జరుపుతున్నామని, బక్షిష్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని తెలిపారు.

ఈ వీడియోపై తీవ్రంగా స్పందించిన ఈసీ బీజేపీ అభ్యర్థి విర్క్‌కు నోటీసులు జారీ చేసింది. అసంద్‌ నియోజకవర్గంలో పోలింగ్‌ పర్యవేక్షణకు ప్రత్యేక వ్యక్తిని కూడా నియమించింది.కాగా తాను మాట్లాడినట్టు నకిలీ వీడియోను వైరల్‌ చేస్తున్నారని, ఈవీఎంలపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: