పశ్చిమ బెంగాల్‌ లో సీపీఎం నేత అయిన సుభాష్ చంద్రదేవ్ హత్యం తీవ్ర కలకలం రేపింది దేశంలో. మూడు రోజులుగా ఆయన కనబడకపోవడంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు సుభాష్‌ ను హత్య చేసినట్లు సోమవారం పోలీసులు గుర్తించారు. ముక్కలు ముక్కలుగా ఆయన మృతదేహం భాగాలు దొరకడంతో స్థానికంగా సంచలనం రేపింది. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా కేసు మిస్టరీ త్వరగానే వీడింది.


దీనికి సంబంధించిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక మహిళలో అక్రమ సంబంధం ఉన్న కారణంగానే ఆయన్ను దారుణంగా హతమార్చినట్లు పోలీసులు సేకరించిన  వివరాల ప్రకారం. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, సుభాష్ చంద్రదేవ్ సీపీఎం పార్టీకి చెందిన ఒక నాయకుడు. అయన ఓ మహిళతో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 


కొద్ది రోజుల క్రితం వీరి సంబంధం సదరు మహిళ భర్తకు తెలిసింది. అతడు వార్నింగ్ ఇచ్చినా చంద్రదేవ్ పట్టించుకోలేదు అని తెలిపారు. ఆ మహిళతో అలాగే వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు చనిపోయిన సుభాష్‌. దీనితో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె భర్త, సుభాష్ చంద్రదేవ్‌ ను హత్యచేయాలని పక్కాగా ప్లాన్ చేసి దాన్ని అమలు చేశాడు అని తెలిపారు పోలీసులు.


హత్య చేసిన సదరు వ్యక్తి సుభాష్‌ ను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మూడు సంచుల్లో ప్యాక్ చేశాడు. ఒక బ్యాగ్‌ ని సమీపంలోని వెదురు తోటలోకి విసిరేసి, ఇంకో బ్యాగ్‌ని నదిలో పడేశాడు. ఇంకొక సంచి ఓ నిర్మానుష్య ప్రాంతంలో సుభాష్ చంద్ర దేవ్ బైక్ సమీపంలో దొరికింది. సుభాష్ కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ దంపతులను కూడా విచారణలో భంగ వారిని విహరించారు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా ఆ మహిళ భర్త నేరాన్ని ఒప్పుకున్నాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే చంపినట్లు ఆ వ్యక్తి అంగీకరించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: