ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు.  అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం పింఛన్ విధానంపై పెట్టారు.  అదే సభలో గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగాల కల్పన గురించి చెప్పారు.  దాదాపుగా నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు.  ఉద్యోగాల విషయంలో జగన్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.  


దాదాపుగా 2.5 లక్షల మంది గ్రామవాలంటీర్ల పోస్టులను ఫీల్ చేశారు.  ఏ గ్రామంలోని వారు ఆ గ్రామంలోనే పనిచేసే అవకాశం కలిగింది.  ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామవాలంటీర్.  ఇది కాకుండా ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు కూడా చేశారు.  దీంతో ప్రజల కళ్ళలో ఆనందం నిండింది.  వీటితో పాటుగా ప్రజలకు ఉపయోగపడే అనేక పధకాలను జగన్ రూపొందించారు.  ఇవన్నీ ఇప్పుడు అమలు జరుగుతున్నాయి.  ఇక ఇదిలా ఉంటె,గతంలో జగన్ పాదయాత్ర చేసే సమయంలో అర్చకులకు ఓ హామీ ఇచ్చారు.  దానిని ఇప్పుడు జగన్ అమలు చేస్తున్నారు.  


అదేమంటే, అర్చకులకు వంశపారంపర్య హక్కును కల్పించడం.   అర్చకుల కోరిక అయిన వంశపారంపర్య హక్కుల్ని కల్పిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు దేవాదాయశాఖ జీవోను జారీ చేసింది. జగన్ నిర్ణయంపై అర్చక సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది. అలాగే విశాఖ శారదాపీఠాధిపతి స్వరూనంద కూడా ఆనందం వ్యక్తం చేశారు. చాల కాలంగా ఇది పెండింగ్ లో ఉన్నది.  


2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయంలో అర్చకులకు వంశపారంపర్య చట్టాన్ని తీసుకొచ్చారు. గత పదేళ్లుగా ఆ చట్టం అమలు కావడం లేదు. దీనిపై అర్చక సమాఖ్య ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా స్పందించలేదు. గతంలో జగన్ పాదయాత్ర చేసే సమయంలో అర్చకులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.  దీంతో స్పందించిన జగన్ ప్రభుత్వం వెంటనే అమలు చేసింది. అర్చకుల కళ్లలో ఆనందం నింపింది.  ఈ విషయాన్ని జగన్ తన మ్యానిఫెస్టో లో కూడా చేర్చిన సాంగ తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: