హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. యవకుడు జీవితం మీద విరక్తిపుట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు ఈ సమాజం నచ్చడం లేదంటూ ఆత్మహత్య చేసుకునే ముందు తన మొబైల్ తో సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. ఆ యువకుడు మరణం అతని కుటుంబసభ్యులను, స్నేహితులను అందరిని విషాదంలో ముంచింది. 


అసలు విష్యం ఏమిటంటే కూకట్‌పల్లిలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న మారిశెట్టి రాజు అనేయువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు ప్రస్తుత సమాజం నచ్చడం లేదని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆత్మహత్య చేసుకునే ముందు తన సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తనతో పాటు ఉంటున్న స్నేహితులకు ఇబ్బందులు కలగకూడదనే తాను ఈ వీడియో తీసినట్లు అందులో అతడు క్లియర్ గా చెప్పాడు. తన స్నేహితులకు, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు సారీ అంటూ వీడియోను రికార్డ్ చేసాడు. ఆ తర్వాత వీడియోను స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపాడు.


మారిశెట్టి రాజా(26)ది సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ. అయితే ఐదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చాడు. కూకట్‌ పల్లిలోని దయార్‌ గూడలో స్నేహితులతో కలిసి జీవిస్తున్నాడు. ఏసీ మెకానిక్‌గా పని చేసుకుంటున్నాడు. ఇది ఇలా ఉండగా, ఆదివారం రూంలో ఎవరూ లేని సమయంలో రాజా ఫ్యాన్‌ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


వీడియో అందుకున్న కాసేపటి తర్వాత రూంకి చేరుకున్న స్నేహితులు రాజాను చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు చెప్పడంతో వారందరు విషాదంలో మునిగిపోయారు. ఆ తర్వాత అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.


ఈ ఘటనపై రాజా సోదరుడు మారిశెట్టి చంద్రశేఖర్ కూకట్‌ పల్లి పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు ఇచ్చారు. తాను అక్టోబర్ 17 నే ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చానని అయితే, ఆదివారం రాజా స్నేహితులు ఫోన్ చేసి అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు సోదరుడు చంద్రశేఖర్. సొంత గ్రామంలో తమ కుటుంబానికి ఆస్తి తగాదాలున్నాయని, వాటితో విసిగిపోయే రాజా ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో అతను తెలియ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: