చంద్రబాబునాయుడుకు మానసిక సమస్యలు తలెత్తినట్లే అనుమానంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం దెబ్బకు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందన్న వైసిపి నేతల ఆరోపణలు నిజమే అనే అనిపిస్తోంది. ప్రతిరోజు మీడియాలో కనిపించాలన్న ఏకైక కారణంతో జగన్మోహన్ రెడ్డిపై నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళంలో మాట్లాడుతూ తొందరలోనే జగన్ లెక్క తేల్చేస్తానని హెచ్చరించటమే ఆశ్చర్యంగా ఉంది.

 

జగన్ లెక్క తేల్చటానికి చంద్రబాబుకు ఏమీలేదు. చంద్రబాబు లెక్కనే మొన్నటి ఎన్నికల్లో జనాలు తేల్చేశారు. జగన్ కు ఓట్లేసి జనాలు తప్పు చేశారంటూ మళ్ళీ పాత కథనే మొదలుపెట్టారు. జగన్ కు ఓట్లేయటం వల్ల జనాలు మోసపోయారట. వైసిపికి ఎందుకు ఓట్లేశామా అని ప్రజలు ఇపుడు మదనపడుతున్నట్లు చంద్రబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది. మళ్ళీ చంద్రబాబే రావాలని జనాలు కోరుకుంటున్నారంటూ పెద్ద జోక్ వేశారు.

 

మళ్ళీ చంద్రబాబే అధికారంలోకి రావాలని కోరుకునే జనాలెవరూ మాత్రం చెప్పలేదు. చంద్రబాబు నాయకత్వం మీద సీనియర్ నేతలకే నమ్మకం లేక  బిజెపిలో చేరిపోతుంటే జనాలు మాత్రం చంద్రబాబును ఎందుకు కోరుకుంటారు ? వైసిపిని తన్నే దున్నపోతని, తాను మాత్రం పాలిచ్చే ఆవనే విచిత్రమైన పోలికలు చెప్పుకుని తృప్తి పడుతున్నారు. పైగా టిడిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను పులులతోను, వైసిపి 151 మంది ఎంఎల్ఏలను మేకలతో పోలుస్తున్న చంద్రబాబు మానిసిక పరిస్దితిని ఎలా అంచనా వేయాలి ?

 

ఎక్కడైనా గెలిచిన వాడినే పులంటారు. అలాంటిది ఓడిపోయిన వాళ్ళను పులితో పోలుస్తుండటమే విడ్డూరంగా ఉంది.  జంతువులతో పోలుస్తు జగన్ కు పదే పదే  హెచ్చరికలు చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇంతా చేసి జగన్ అధికారంలోకి వచ్చింది నాలుగు నెలల క్రితమే.  చంద్రబాబు ఖాళీ ఖజానాను అప్పగించినా ఉన్నంతలో ఇచ్చిన హామీలను అమలు చేయటంపైనే జగన్ దృష్టి పెట్టిన విషయం అందరూ చూస్తున్నదే. హోలు మొత్తం మీద జగన్ నాలుగు నెలల పాలన బాగానే ఉందన్నట్లు చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: