మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు పోలీసులకు మధ్య తాజా వివాదం మొదలైంది. మాజీ మంత్రి భర్త భార్గవ్ ను అరెస్టు  చేయటానికి వచ్చిన ఆళ్ళగడ్డ పోలీసులపై అఖిల విరుచుకుపడటం తాజాగా సంచలనమైంది. తన భర్తను అరెస్టు చేయటాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ వ్యక్తిగతంగా తీసుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. తన ఇంట్లోకి పోలీసులు ప్రవేశించటాన్ని మాజీ మంత్రి అడ్డుకున్నారు. దాంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

 

విషయం ఏమిటంటే అఖిలప్రియ భర్తపై పోలీసు స్టేషన్లో కేసులున్నాయి. బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకే భార్గవ్ ను అరెస్టు చేసేందుకు జూబ్లిహిల్స్ ఏరియాలో పోలీసులు ఈమధ్య కూడా ప్రయత్నించారు. అయితే పోలీసులనే కారుతో ఢీ కొట్టించేందుకు ప్రయత్నించిన భార్గవ్ తర్వాత అదే కారులోతప్పించుకున్నారు.

 

అప్పటి నుండి పోలీసులు భార్గవ్ కోసం వెతుకుతునే ఉన్నారు. తాజాగా మాజీమంత్రి భర్త ఇంట్లోనే ఉన్నాడని తెలియగానే పోలీసులు ఆళ్ళగడ్డ నుండి అఖిల ఇంటికి ఈరోజు ఉదయం చేరుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించేందుకు పోలీసులకు మాజీమంత్రి అనుమతి ఇవ్వలేదు. దాంతో పక్క ఇంటి కాంపౌండ్ లో నుండి అఖిల ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు ఇంట్లోకి వెళ్ళి భార్గవ్ కోసం వెతకాలని అనుకున్నారు.

 

అయితే మాజీమంత్రి అడ్డుపడ్డారు. తన ఇంట్లోకి ప్రవేశించేందుకు పోలీసులను ఎట్టి పరిస్ధితుల్లోను అనుమతించేది లేదని గట్టిగా చెప్పటమే విచిత్రంగా ఉంది. తన ఇంటిని సెర్చి చేయటానికి పోలీసులు ఎటువంటి అనుమతి లేకుండానే లోపలకు రావాలంటే అనుమతించేది లేదని తెగేసి చెప్పారు.

 

ఇంతకీ సెర్చి వారెంటు ఉందా లేదా అన్న విషయంలో పోలీసులు నోరిప్పటం లేదు. నిజంగానే వారి వద్ద సెర్చి వారెంటు ఉంటే చూపటానికి పోలీసులకు ఎందుకు వెనకాడుతున్నారు ? పోనీ అరెస్టు వారెంట్ అన్నా ఉందా ? అంటే దానికీ సరైన సమాధానం చెప్పటం లేదు. దాంతో భార్గవ్ రామ్ అరెస్టు ప్రయత్నాలు పెద్ద వివాదాస్పదమైంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: