ఓ విమానం వంతెన కింద ఇరుక్కుపోయింది. ఎలాగోలా తీసుకుపోవచ్చులే అని డ్రైవర్ వేసుకున్న అంచనా ఏ ఈ విమానం ఇరుక్కుపోవడానికి కారణం. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని హర్బిన్‌లో ఓ విమానాన్ని రోడ్డు మార్గం మీదుగా విమానాశ్రయానికి తరలించారు. ఈ నేపథ్యంలోనే దాని విడి భాగాలను భారీ ట్రక్ మీదకు ఎక్కించి తీసుకెళ్తుండగా ఓ విచిత్ర ఘటన జరిగింది. 


ఆ విమానాన్ని రోడ్డు మార్గంఫై తీసుకెళ్తుండగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి వచ్చింది. అయితే, డ్రైవర్ సరైన అంచనా వేసుకోకుండా ట్రక్‌ను ముందుకు తీసుకెళ్లాడు దీంతో ఆ విమానం వంతెన కింద ఇరుక్కుపోయింది. ఇంకా అప్పటి నుండి ఆ విమానాన్ని అక్కడ నుండి ఎలా తొలిగించాలి అని విమానాయన సంస్థ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 


అయితే ఈ విమానాన్ని తీసుకురడానికి వంతెన తొలిగించి ఆ విమానాన్ని బయటకు తీసుకురావడం అసాధ్యం అని అధికారులు చెప్తున్నారు. అయితే ఆ విమానం బయటకు తియ్యాలంటే ట్రక్కు టైర్లలో గాలిని తగ్గించాలని అప్పుడు విమానం బయటకు తియ్యచ్చని అభిప్రాయపడుతున్నారు. అదే ఎలా అనుకుంటున్నారా ? అదేనండి టైర్లలో గాలి తగ్గగానే విమానానికి, వంతెనకు మధ్య ఖాళీ ఏర్పడి విమానం బయటకు వస్తుంది అని అంటున్నారు. 


అయితే ఈ విమానం ఇరుక్కుపోవడం.. దాన్ని బయటకు తియ్యడానికి విమానయాన యాజమాన్య కష్టపడటాన్ని కొందరు నెటిజన్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటో ఒకసారి మీరు చుడండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: