ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక్కడ ఎన్నికలు ఉన్న లేకపోయిన రాజకీయ పార్టీలు ప్రత్యర్ధ పార్టీలని చిత్తు చేయడానికి వ్యూహాలు రచిస్తూ ముందుకెళుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఏపీలో బీజేపీ, టీడీపీ, వైసీపీలు ఒకరిని మించి ఒకరు ఎత్తులు వేస్తూ ప్రత్యర్ధ పార్టీలకు చెక్ పెట్టాలని చూస్తున్నాయి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని రెండో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ....ఒక్కశాతం కూడా ఓట్లు దక్కించుకొని ఏపీలో పాగా వేయాలని వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే.


అందులో భాగంగానే ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తుంది. ఆ పార్టీ నేతలనీ లాగేసుకుంటూ వీక్ చేయాలని చూస్తుంది. అలాగే టీడీపీకి చెక్ పెట్టేసి వచ్చే ఎన్నికల నాటికి అధికార వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగిపోవాలని అత్యాశ పడుతుంది. అయితే బీజేపీ వ్యూహాలని గమనించిన చంద్రబాబు, వారిని మించే వ్యూహంతో ముందుకొచ్చేశారు. తమ నేతల వలసలని ఆపేందుకు మళ్ళీ బీజేపీకి దగ్గర చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  


పైగా భవిష్యత్ లో ఎన్డీయేతో పొత్తు ఉండే అవకాశముందని చెబుతున్నారు. మొన్న ఎన్నికల్లో బీజేపీకి దూరం జరిగి తప్పు చేశానని పదే పదే మాట్లాడుతున్నారు. ఇక బాబు డ్రామాలు కనిపెట్టిన బీజేపీ నేతలు ..టీడీపీకి గేట్లు క్లోజ్ చేశామని, భవిష్యత్ లో ఎలాంటి పొత్తు ఉండదని కన్నా, జి‌వి‌ఎల్, సునిల్ దేవర్ లాంటి నేతలు చెబుతున్నారు.  పైగా టీడీపీ నేతలకు గేట్లు తీసే ఉంచామని, తమ పార్టీలో చేరవచ్చని ప్రకటనలు చేస్తున్నారు. పనిలో పనిగా టీడీపీని ఇంకా ఇబ్బంది పెట్టేందుకు గతంలో చేసిన అవినీతిని వైసీపీ ప్రభుత్వం బయటపెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు.


అయితే వీళ్ళకంటే జగన్ ఏమి తక్కువ తినలేదు. వీళ్ళ వ్యూహాలకు ధీటుగా జగన్ ఎత్తులు వేస్తున్నారు. బీజేపీ ఎదిగితే టీడీపీకే కాదు తమకు ఇబ్బంది అని గ్రహించారు. అందుకే ఒకవైపు టీడీపీకి చుక్కలు చూపిస్తూనే....మరోవైపు బీజేపీని బలపడనివ్వకుండా చేస్తున్నారు. టీడీపీలోనే బడా నేతలని బీజేపీలోకి వెళ్లనివకుండా చేస్తూ....తమ పార్టీలోకి లాగేసుకుంటున్నారు. అటు జనసేన నేతలని కూడా చేర్చేసుకుని పార్టీ కండువా కప్పేస్తున్నారు. వైసీపీ గేట్లు ఎత్తడం వల్ల, బీజేపీలోకి వలసలకు బ్రేక్ పడిపోయింది. ఏదో వైసీపీలోకి వెళ్లలేని నేతలే బీజేపీ వైపు చూస్తున్నారు. వారి వల్ల బీజేపీకి ఒరిగిదేమీ లేదు. ఇలా ఏపీలో మూడు పార్టీలు ఎత్తుకు పైఎత్తు వేస్తూ....రాజకీయాలని రసవత్తరంగా మార్చేశాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: