ఉపఎన్నిక ముగిసిన తర్వాత బయటపడుతున్న ఎగ్జిట్ పోల్ ఫలితంతో అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. మామూలుగా ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగిసిన దశలో ఆర్టీసీ సమ్మె మొదలైంది. పోలింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ సమ్మె ప్రభావం కూడా పెరిగింది. ఇక పోలింగ్ నాటికి సమ్మె ప్రభావం తీవ్రరూపం దాల్చింది. కాబట్టి హుజూర్ నగర్ ఉపఎన్నికలో గెలుపుపై కెసియార్ ఆశలు వదిలేసుకున్నారంటూ ప్రచారం జరిగింది.

 

సీన్ కట్ చేస్తే పోలింగ్ తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడైంది. దాని ప్రకారమైతే టిఆర్ఎస్ అభ్యర్ధిదే గెలుపు అంటూ సంకేతాలు వచ్చాయి. అంటే యావత్ తెలంగాణాలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా చాలా ఉద్యోగ సంఘాలు, విద్యార్ధి, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు మద్దతుగా నిలబడ్డాయి. కాబట్టి ఈ సమ్మె ప్రభావం కచ్చితంగా హుజూర్ నగర్ ఉపఎన్నికపై పడుతుందనే అనుకున్నారు.

 

కెసియార్ ప్రభుత్వంపై జనాలు మండిపోతున్న కారణంగా  ఉపఎన్నికలో  అధికార పార్టీ ఓడిపోతుందని అనుకున్నారు. కానీ సీన్ రివర్సవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. అంటే ఎగ్జిట్ పోల్ నిజమే అయితే ఆర్టీసీ సమ్మె ప్రభావం ఉపఎన్నిక పై ఏమీ లేనట్లే అనుకోవాలి.

 

ఓ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ గెలిచినా, ఓడినా ప్రభుత్వంపై పడే ప్రభావం ఏమీ ఏండదు. కానీ ఈ ఫలితం అందులోను సమ్మె నేపధ్యంలో ప్రజల మనోభావాలను ప్రతిఫలిస్తుందనే చెప్పవచ్చు. అలాంటిది ఇన్ని వేలమంది సమ్మెలో పాల్గొంటున్నా టిఆర్ఎస్సే గెలుస్తోందంటే కెసియార్ సమ్మెను ఎందుకు లెక్క చేస్తారు.

 

ఇప్పటికే ప్రతిపక్షాలు చెప్పినా, కోర్టు ఆదేశించినా, గవర్నర్ వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసినా కూడా కెసియార్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపటాన్ని ఇష్టపడటం లేదు. సమ్మె చేస్తున్న వాళ్ళతో పాటు మద్దతు తెలుపుతున్న వాళ్ళ లెక్కేంటన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలో జరుగుతున్న హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితంపైనే కెసియార్ వ్యతిరేకులందరూ ఆశలు పెట్టుకున్నారు. చూడబోతే ఈ ఉపఎన్నికే ఆర్టీసి సమ్మెకు షాకిచ్చేదిగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: