బీహార్ రాష్ట్రం భోపాల్ లోని హుక్కా లాంజులు లవ్ జిహాద్ ను వ్యాపింపజేసే కేంద్రాలుగా మారాయని మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ సింగ్ ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వీటితో సంబంధం ఉందన్న ఆయన.. తన కూతురు లవ్ జిహాద్ బాధితురాలిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భోపాల్ నగరంలో ఉన్న హుక్కా లాంజ్‌ యజమానులు వెంటనే వాటిని మూసివేయాలని హెచ్చరించారు. 


లేనిపక్షంలో వాటి భద్రతకు భంగం వాటిల్లితే తనను ప్రశ్నించవద్దన్నారు. కాగా తన ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని, కుటుంబ సభ్యుల చిత్రహింసలు తట్టుకోలేక అజ్జాతంలోకి వెళ్లినట్లు సురేంద్రనాథ్ సింగ్ కూతురు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సురేంద్రసింగ్..  తన కూతురు ఐదేళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతోందని, అందుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మానసికంగా కుంగిపోయిన తన కూతురితో కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


సమాజంలో ప్రతీ తండ్రి తన కూతురిని తన మతం వాడికే ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడతాడని.. అందుకు తానేమీ మినహాయింపు కాదన్నారు. దేవుడిపై నమ్మకం ఉంచి, సంప్రదాయాలు పాటించే వ్యక్తికే తన కూతురును ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానన్నారు. భోపాల్‌లో లవ్‌ జిహాదీ కొనసాగితే క్రుసేడ్లు చేయడానికి కూడా తాము వెనుకడుగువేయబోమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 


అటు పిల్లలు హుక్కా లాంజ్ లకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించిన ఆయన.. దయచేసి వాటివైపు వెళ్లవద్దు అని పిల్లలకు సూచించారు. అదే సమయంలో ప్రపంచం సంగతి ఎలా ఉన్నా భోపాల్ లో మాత్రం హుక్కా లాంజ్ లను ఉపేక్షేంచేది లేదని హెచ్చరించారు. నిజానికి పరదేశ సంప్రదాయాలు మన భారతీయుల పై ఏ విధంగా ప్రతాపం చూపుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: