సాధారణంగా టీడీపీ లాంటి పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆ పార్టీలో ఉన్న బలమైన నేతలు మాత్రం పార్టీని మారకుండా ఆ పార్టీని కాపాడుకుంటూ వస్తారు. కానీ 2019 ఎన్నికలో టీడీపీ ఘోర ఓటమి .. ఆ పార్టీలో ఉన్న బలమైన నేతలను కూడా ఉక్కిరి బిక్కిరి చేసింది. హేమా హేమీలు కూడా ఓడిపోవటంతో ఆ పార్టీకి భవిష్యత్ లేదని అందరూ ఫిక్స్ అయిపోయారు. కడపలో ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన సంగతీ తెలిసిందే. ఇప్పటికే టీడీపీకి ఉన్న ఆర్ధిక మూల స్థంభాలైన నలుగురు రాజ్య సభ ఎంపీలు బీజేపీలోకి వెళ్లిపోయిన సంగతీ విధితమే. దీనితో టీడీపీ పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడింది. 


ఎన్నికల ముందు టీడీపీ మునిగిపోయే నావ అని కొంత మంది ముందుగానే అర్ధం చేసుకొని వైసీపీలోకి వెళ్లిపోయారు. టీడీపీలో ఉండిపోయిన నేతల పరిస్థితి ఘోరంగా తయారైంది. దీనితో ఇప్పుడు ఈ నేతలు టీడీపీలో ఉండి తప్పు చేశామని ఆఫ్ ది రికార్డు చర్చించుకుంటున్నారు.  టీడీపీ పార్టీ మళ్ళీ కోలుకుంటుందని ఇప్పుడు ఏ నేత కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి. మొన్న తోటా త్రిమూర్తులు వైసీపీలో చేరిన సంగతీ తెల్సిందే. ఇప్పటీకే పలువురు నేతలు టీడీపీ పార్టీకి రాజీనామా కూడా చేసిన సంగతీ తెలిసిందే.  టీడీపీ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో నేతలందరికీ అర్ధం అయ్యింది. పైగా చంద్రబాబుకు వయసు కూడా అయిపోవడంతో ఆ పార్టీని వదిలిపెట్టడం మంచిదని నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వారందరు ఎందుకు పార్టీలో ఉన్నారో అందరికీ తెలిసిందే.


వైసీపీ తలుపులు తెరిస్తే చాలు ... వెంటనే దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ జగన్  ఆ పని చేయడని తెలుసు కాబట్టి చంద్రబాబు నిర్భయంగా ఉన్నారు. అయితే నేతలు జంప్ అయ్యే పరిస్థితి లేకపోవటంతో రాజీనామాలు చేసి మరీ పార్టీకి దూరం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనితో తెలంగాణ టీడీపీ మాదిరిగా ఒక్కరో .. ఇద్దరో ఎమ్మెల్యేలు మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే  తూర్పు గోదావరి జిల్లా ప్రత్తి పాడు స్థానం నుంచి పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయిన వరుపుల రాజా గురువారం పార్టీకి రాజీనామా చేశారు. వరుపుల రాజా గోదావరి జిల్లాలో మంచి పేరు ఉన్న నేత. కానీ జగన్ ధాటికి తట్టుకోలేక ఓడిపోయారు. ఆ తరువాత లిస్ట్ లో ..  మొన్నటి ఎన్నికల్లో విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సీటు నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయిన ఆడారిఆనంద్ కుమార్ కూడా టీడీపీ పార్టీకి రాజీనామా కూడా సమర్పించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: