తెలుగుదేశానికి షాకులు ఇపుడు అలవాటుగా మారిపోతున్నాయి. ఆ పార్టీ వైపు నుంచి చూసుకుంటే అవి షాకులు అనకూడదేమో. కానీ వాటిని చెప్పాల్సి వస్తే అలాగే చెప్పాలి. ఇక ఏపీలో 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు అయిన టీడీపీ భవిష్యత్తు విషయంలో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈసారి గెలిస్తే ఒకే, లేకపోతే పార్టీ లేనట్లే అన్నట్లుగా అటు congress PARTY YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ, ఇటు టీడీపీల మధ్యన జరిగిన ఫైనల్ పోరుగా 2019 ఎన్నికలను చెప్పుకోవాలి.


ఆ విధంగా చూసుకున్నట్లైతే ఏపీలో ఇపుడు టీడీపీ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. పూటకో నేత పార్టీ మారిపోతున్నారు. కర్నూల్ విషయానికి వస్తే ఎన్నికల ముందు ఆ పార్టీలో చేరిన మాజీ మంత్రి, సీనియర్ నేత అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సైకిల్ దిగిపోతారన్నది తాజా సమాచారం. బైరెడ్డి ఇప్పటికె ఆనేక పార్టీలను మారారు. ఆయన కాంగ్రెస్, తెలుగుదేశం ఇలా మారుతూ వస్తూ ఇపుడు మళ్ళీ టీడీపీ నీడన చేరారు. 


అయితే తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడంతో బైరెడ్డి చూపు బీజేపీ మీద పడిందట. ఈ మేరకు ఆయన పార్టీ కార్యకర్తలతో మీటింగు పెట్టినట్లుగా తెలుస్తోంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరడానికి అన్నీ సిధ్ధం చేసుకున్న బైరెడ్డి సూచనాప్రాయంగా తన అనుచరులకు ఈ విషయన్ని చెబుతున్నారుట. ఆయన వాదన ప్రకారం చొసుకుంటే ఏపీలో టీడీపీ ఇక ఎత్తిగిల్లలేదన్న భావన వ్యక్తం అవుతోంది. టీడీపీ నుంచి ఎంత వేగంగా జంప్ అయితే అంత మంచిదన్న ఆలోచనలో ఈ రాయలసీమ పెద్దాయన ఉన్నారట. దానికి తోడు బీజేపీ కూడా ఆయన్ని ఆహ్వానిస్తూండడంటో జాతీయ పార్టీలో చేరేందుకు బైరెడ్డి మొగ్గు చూపుతున్నారట. రేపో మాపో ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే టీడీపీకి రాయలసీమలో బలమైన నాయకుడు ఒకరు పోయినట్లే.



మరింత సమాచారం తెలుసుకోండి: