తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై రాజ్‌భ‌వ‌న్ వీడ‌నున్నారు.. తాను ర‌బ్బ‌ర్ స్టాంప్‌ను కాదు.. ర‌ణ‌క్షేత్రంలో దూకే రాణి రుద్ర‌మ‌ను అంటూ కేసీఆర్‌పై ర‌ణం చేసేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నారు. అందుకే గ‌వ‌ర్న‌ర్‌ రాజ్‌భ‌వ‌న్ నుంచి ర‌ణ‌క్షేత్రంలోకి  వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు ప‌రిమితం అయితే.. తాను రాజ్‌భ‌వ‌న్‌కు ప‌రిమితం కాలేను అంటూ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌జాక్షేత్రంలో ప‌నిచేసేందుకు స‌న్న‌ద్దం అవుతున్నారు.. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో జ‌రుగుతున్న ప‌రిపాల‌న‌ను జాగ్ర‌త్తగా గ‌మ‌నిస్తున్న గ‌వ‌ర్న‌ర్ త‌న ల‌క్ష్యం ఏంటో గుర్తెరిగారు.. తెలంగాణ స‌మాజానికి ప‌ట్టిన రుగ్మ‌త‌ను రూపుమాపేందుకు డాక్ట‌ర్‌గా చికిత్స చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నారు.


ప‌ట్ట‌ణాల్లో.. అద్దాల మేడ‌ల్లో ఉంటే జ‌నం స‌మ‌స్య‌లు ఏమీ తెలుస్తాయి.. ప‌ల్లేల‌కు, గూడేలకు వెళితే వారు ప‌డుతున్న ఈతిబాధ‌లు, క‌ష్టాలు తెలుస్తాయ‌ని ఆమే తండాబాట ప‌ట్టేందుకు సిద్ద‌మ‌వుతున్నారు.. తండాల్లో, ప‌ల్లేల్లో నిద్ర చేసేందుకు, గిరిజ‌న, ప‌ల్లే ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు ప‌ల్లేబాట ప‌ట్ట‌నున్నారు గ‌వ‌ర్న‌ర్‌...అందుకే ఆమే సంకేతాలు ఇవ్వ‌డం విశేషం. తెలంగాణ కు గ‌వ‌ర్న‌ర్‌గా నియామ‌కం కాగానే ఆమె తెలంగాణ జాతిపై త‌న అభిమానంను మ‌రింత‌గా పెంచుకున్నారు.


తెలంగాణ బ‌తుక‌మ్మ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని రాజ్‌భ‌వ‌న్‌లోనే బ‌తుక‌మ్మ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించి తెలంగాణ జాతిపైన త‌న అభిమానం ఏపాటిదో నిరూపించుకున్నారు. త‌రువాత తెలంగాణ‌లో ఉన్న స‌మ‌స్య‌లు తెలుసుకోవడం, వాటికి ప‌రిష్కార మార్గాలు చూడటం చేస్తున్నారు. అందులో భాగంగా ఆర్టీసీ స‌మ్మెపై ఆమే స‌మీక్ష చేయ‌డం, వాటికి తెలంగాణ స‌ర్కారుకు ప‌రిష్కార మార్గాలు చూపారు. అయినా తెలంగాణ స‌ర్కారు ఆర్టీసీ సమ్మెపై విర‌మ‌ణ‌కు చొర‌వ తీసుకోక‌పోవ‌డంతో ఆమేలో ప‌ట్టుద‌ల పెరిగింద‌ట‌. అందుకే ప‌ల్లెబాట ప‌ట్టి ప్ర‌భుత్వం చేస్తున్న‌ప‌నుల‌ను, తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఆమే కేంద్రానికి నివేదిక పంపేందుకు స‌మాయ‌త్తం అయ్యేందుకు ప‌ల్లేబాట ప‌ట్టి ప‌ల్లే నిద్ర చేయ‌నున్న‌ద‌ట‌..


తెలంగాణ‌లోని యూనివర్సిటీల్లో అస్త‌వ్య‌స్త ప‌రిపాల‌న తెలుసుకున్న గ‌వ‌ర్న‌ర్ ఛాన్స్ లర్ హోదాలో ఆమె యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ లతో, రిజిస్ట్రార్ లతో సమీక్ష సమావేశం నిర్వహించి,  యూనివర్సిటీల అభివృద్ధికి పలు సూచనలు చేశారు. విద్యా ప్రమాణాలు పెంచడానికి ఏం చేయాలో, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులతో చర్చించారు. ఇక క్యాబ్ డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు వెళ్తామని పేర్కొన్న సమయంలో కూడా ఆమె సమస్య పరిష్కరించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి సమ్మె విరమింపజేశారు.


ఇలా త‌న‌వంతుగా తెలంగాణ ప‌రిపాల‌న‌తో త‌న‌దైన ముద్ర వేస్తున్న గ‌వ‌ర్న‌ర్ ఇప్పుడు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అదే గిరిజ‌న తండాల్లో నిద్ర‌లు చేసి గిరిజ‌న ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాల‌నే నిర్ణ‌యం తీసుకున్నారు.  గిరిజన సంక్షేమంపై రాజ్ భవన్ లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.  ములుగు లో ఏర్పాటు చేయబోయే గిరిజన యూనివర్సిటీ కి కేంద్రం నుంచి అనుమ‌తులు తెచ్చెందుకు ప్ర‌య‌త్నిస్తానంటున్నారు. గిరిజన యువతను పారిశ్రామికవేత్తగా చేయాల‌నే ఆలోచ‌న చేస్తున్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం తాను గిరిజన ప్రాంతాల్లో పర్యటించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.


భ‌ద్రాచ‌లం, నాగ‌ర్‌క‌ర్నూల్ నుంచి వ‌చ్చిన లంబాడాలు, కోయ‌వారితో క‌లిసి నృత్యం చేసి ఆక‌ట్టుకున్నారు గ‌వ‌ర్న‌ర్‌. తండా నిద్ర‌కు వ‌స్తాన‌ని వారికి మాటిచ్చిన గ‌వ‌ర్న‌ర్ ఇక‌ముందు రాజ్‌భ‌వ‌న్ ను వ‌దిలి ప్ర‌జాక్షేత్రంలో దూక‌నున్న‌ద‌న్న మాట‌. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తిభ‌వ‌న్ వీడి బ‌యటికి రాకుండానే  ప‌రిపాల‌న చేస్తుంటే ఇప్పుడు రాజ్‌భ‌వ‌న్ వీడి ప‌ల్లేలు, తండాలు చుట్టి రావ‌డానికి గ‌వ‌ర్న‌ర్ సై అన‌డంతో సంచ‌ల‌నంగా మారింది.. రాబోవు రోజుల్లో గ‌వ‌ర్న‌ర్ తెలంగాణ రాజ‌కీయాల్లో పెను మార్పులు తెచ్చె అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.


మరింత సమాచారం తెలుసుకోండి: