తెలంగాణాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండు మినహా కార్మిక సంఘాల ఇతర డిమాండ్లను పరిశీలన చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.వెంకటేశ్వర్‌రావు అధ్యక్షతన అయిదుగురు అధికారులతో కమిటీని నియమించారు.

ఇక హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకట్రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎండీకి అందచేస్తాము అని అంటున్నారు. దీన్ని తదుపరి విచారణ సందర్భంగా హైకోర్టుకు సమర్పిస్తారు. ఇక  తక్షణం వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేయలి  అని సీఎం అధికారులను ఆదేశించడం జరిగింది.
ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రోద్బలంతో చట్టవ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్, భాజపా పార్టీలు మద్దతు పలకడం చాల అన్యాయం అని అయినా తెలిపారు.

ఇక తెలంగాణలో  ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రాల్లో మీరు అమలు చేస్తున్నారా? అని సీఎం ప్రశ్న వేశారు. ఇక ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రగతిభవన్లో దాదాపు నాలుగు గంటల పాటు సమీక్ష నిర్వహించడం జరిగింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్మ, నర్సింగ్ రావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, రవాణా కమిషనర్ సందీప్ సుల్తానియా, ఆర్టీసీ ఈడీలు ఈ  సమీక్ల లో పాల్కొనడం జరిగింది. 


 సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి  ఇబ్బంది కలుగకుండా చేసిన ప్రయత్నాలు అన్ని ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. సమీక్షలో సీఎం మాట్లాడుతూ.... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రచారాలు చేస్తే కఠిన చర్చలు జరుపుతామని కార్మిక సంఘాల నాయకులకు తెలియచేసారు.  కార్మిక సంఘాల తరఫున హైకోర్టులో వాదించిన న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ నెరవేరితే తప్ప చర్చలకు రాబోమని కార్మికులు ఎప్పుడూ తెలిపే లేదు అని అన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: