ఆంధ్రప్రదేశ్, తెలంగాణ..రెండు తెలుగు రాష్ట్రాలు . 2014 వరకు ఉమ్మడి ఏపీగా కలిసి ఉన్నాయి. కానీ స్వయం పాలన, నిధులు, నియమకాలు, నీళ్ళు అంటూ ఎన్నో ఏళ్లుగా ఉద్యమం చేస్తున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. ఆ రాష్ట్రానికి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారు. అయితే పక్కనే ఉన్న ఏపీకి 2014లో చంద్రబాబు సీఎం అయితే, మొన్న ఎన్నికల్లో గెలిచి జగన్ సీఎం అయ్యారు. ఎవరి పాలన వారు చేసుకుంటూ ముందుకెళుతున్నారు.


ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ పక్కపక్కనే ఉండటం, పైగా తెలుగు రాష్ట్రాలు కావడంతో పాలనలో పోలికలు ఎక్కువగా వస్తున్నాయి. ఏ సీఎం మంచిగా చేస్తున్నాడు అనే దానిపై ఎక్కువ పోలిక ఉంటుంది. అయితే చంద్రబాబు, కేసీఆర్ లు ఉన్నప్పుడూ ఈ పోలిక అంతగా రాలేదు. కానీ ఎప్పుడైతే జగన్ సీఎం అయ్యాడో అప్పటి నుంచి కేసీఆర్ కు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. జగన్ తీసుకునే నిర్ణయాల వల్ల కేసీఆర్ కు ఊహించని ఇబ్బందులు ఎదురవతున్నాయి. జగన్ లాగే కేసీఆర్ కూడా నిర్ణయాలు తీసుకోవాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.


మొదట జగన్ ఇతర పార్టీ నేతలు తమ పార్టీలో చేరాలంటే పదవులకు రాజీనామా చేసే రావాలని రూల్ పెట్టారు. ఆ రూల్ కేసీఆర్ 2014లోనూ, ఇప్పుడు అసలు పాటించలేదు. ఇబ్బడి ముబ్బడిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకున్నారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ జగన్ ని పొగుడుతూ...కేసీఆర్ ని తిడుతుంది. ఆ తర్వాత జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే నిర్ణయం కేసీఆర్ అమలు చేయాలని గత 20 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. కేసీఆర్ మాత్రం అర్తెసీని ప్రైవేట్ పరం చేసేందుకు చూస్తున్నారు. దీనిపై కార్మికులు మండిపడుతున్నారు.


అలాగే రైతులకు పెట్టుబడి సాయం తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఇస్తుంది. తాజాగా జగన్ కూడా congress PARTY YSRCP' target='_blank' title='వైఎస్సార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైఎస్సార్ రైతు భరోసా పేరుతో సాయం చేస్తున్నారు. అయితే జగన్ కౌలు రైతులకు కూడా సాయం అందిస్తుండగా, కేసీఆర్ కౌలు రైతులని పక్కనబెట్టేసింది. అదేవిధంగా జగన్ తొలిసారి అధికారంలోకి రావడమే ఐదు నెలల్లో 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల వరకు ఇచ్చారు.  అలాగే వాలంటీర్ల పేరిట 2 లక్షల ఉద్యోగాలు వరకు ఇచ్చారు. కానీ కేసీఆర్ 2014 నుంచి ఇప్పటివరకు పెద్దగా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అసలు తెలంగాణ వచ్చిందే నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయని, కానీ కేసీఆర్ ఆ పని చేయడం లేదు.


ఇక ఇంకొకటి జగన్ ఏపీలో ఇళ్ళు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ళు కట్టించాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. అటు కేసీఆర్ మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తానని చెప్పి, హ్యాండ్ ఇచ్చారు. ఏదో హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. జగన్ ఒకవేళ ఇళ్ళు నిర్మించేసి ఇస్తే, కేసీఆర్ కు మరిన్ని ఇబ్బందులు తప్పవు. అయితే తెలంగాణలో ఆర్టీసీ విషయంలో జరిగినట్లుగా మిగతా విషయాలపై సరైన పోరాటం జరగడం లేదు గానీ, లేదంటే కేసీఆర్ కు చిక్కులు తప్పవు.  


మరింత సమాచారం తెలుసుకోండి: