ప్రపంచంలోనే ఎత్తయిన భవనం ఏది అంటే... అందరికీ గుర్తొచ్చే పేరు టూరిస్ట్ డెస్టినేషన్ అయినా దుబాయ్ లోని  బుర్జ్ ఖలీఫా భవనం. ఇప్పటివరకు ప్రపంచంలో ఈ భవనం కంటే ఎత్తైన భవనం ఎక్కడ కట్టలేదు. 2725 అడుగుల ఎత్తు ఉంటుంది ఈ బుర్జ్ ఖలీఫా భవనం. ఈ భవనాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనడంలో అతిశయోక్తి కాదు. ఆ భవనాన్ని చూస్తే అందరూ నోరెళ్లబెట్టారు సింగ్. అంత అద్భుతంగా అంత ఎత్తుగా ఉంటుంది దుబాయ్ లోని  బుర్జ్ ఖలీఫా భవనం . అయితే బుర్జ్  ఖలీఫా భవనం వద్ద తాజాగా అద్భుత ఘటన చోటుచేసుకుంది. దుబాయ్ లో గత కొంత కాలంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ప్రారంభమైన వర్షాలు వారాంతం కొనసాగుతూనే ఉన్నాయి. 

 

 

 ఈ సందర్భంగా ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది దుబాయ్ లోని  బుర్జ్ ఖలీఫా పై భాగంలో. ప్రపంచంలోనే ఎత్తయిన బుర్జ్ ఖలీఫా పై భాగాన్ని ఓ మెరుపు తాకింది. దీనికి సంబంధించిన ఓ ఫోటో ని ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. జోహైబ్  అంజున్  అనే ఫోటోగ్రాఫర్ ఈ అరుదైన సన్నివేశాన్ని ఫోటో తీయడానికి గత ఏడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎడారి దేశమైన దుబాయ్ లో వర్షాలు పడిన ప్రతిసారి బుర్జ్  కలీఫా ఎదుట క్యాంపు వేసుకుని మరి.. కెమెరా పట్టుకుని ఆ మెరుపు కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. అద్భుతమైన సన్నివేశం కోసం రాత్రులు అప్రమత్తంగా ఉండే వాడు. ఏడేళ్ల నుంచి బుర్జ్  కలీఫా భవనం పై భాగాన్ని మెరుపు తాకుతుందని వేయికళ్ళతో ఎదురు చూస్తున్న ఆ ఫోటో గ్రాఫర్ కోరిక తీరింది. దీంతో ఈ సన్నివేశాన్ని తన కెమెరాలో క్లిక్ మనిపించాడు. దీంతో ఎట్టకేలకు ఆ ఫోటో గ్రాఫర్ ప్రయత్నం ఫలించింది. 

 

 

 2720 అడుగుల ఎత్తులో ఉన్న బుర్జ్ ఖలీఫా భవనం పైభాగాన్ని మెరుపు తాకుతూ ఉన్న అద్భుతమైన సన్నివేశాన్ని పర్ఫెక్ట్ గా ఫోటో తీశాడు జోహైర్ అంజన్  అనే ఫోటోగ్రాఫర్. దీంతో ఆ ఫోటో గ్రాఫర్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఏడేళ్ల కష్టానికి ఫలితం దక్కింది ఆ ఫోటో గ్రాఫర్ చెబుతున్నాడు. ఈ అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు తనకు అవకాశం ఆ భగవంతుడు కల్పించాలని చెప్పుకొచ్చాడు జోహైర్ అంజున్ . బుర్జ్ కలీఫా ను మెరుపు తాకిన అద్భుత సన్నివేశం తోనే తనకు 2020 సంవత్సరం ప్రారంభం అయిందని ఆనందంతో తప్పిపోయాడు. కాగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: