ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆ ఇద్దరి నేతల వ్యవహారశైలి వల్ల తెరాస నాయకత్వానికి తిప్పలు  తప్పడం లేదు . ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోను వారిద్దరి మధ్య నెలకొన్న  ఆధిపత్య పోరు పార్టీ ప్రతిష్టను దిగజార్చింది . అయినా ఇద్దరి నేతల వ్యవహారశైలి లో ఏమాత్రం మార్పులేకపోగా  ప్రస్తుతం జరుగుతున్న సహకార సంఘ ఎన్నికల్లోను నువ్వా, నేనా అన్నట్లు పోటీపడుతున్నారు . కొల్లాపూర్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ తరుపున అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత  పార్టీ నాయకత్వం,  స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి అప్పగించింది . reddy BEERAM' target='_blank' title='హర్షవర్ధన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>హర్షవర్ధన్ రెడ్డి ఆధిపత్యాన్ని సహించలేని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ నాయకత్వం పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు .

 

 తన అనుచరులకు reddy BEERAM' target='_blank' title='హర్షవర్ధన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>హర్షవర్ధన్ రెడ్డి  టికెట్లు ఇవ్వలేదని ఆగ్రహించిన ఆయన  ఏకంగా మున్సిపాలిటీ పరిధిలోని  అన్ని వార్డుల్లో తన అనుచరులను  పోటీకి దించారు . కొల్లాపూర్ మున్సిపాలిటీ లో  మెజార్టీ వార్డుల్లో జూపల్లి వర్గీయులే విజయం సాధించినప్పటికీ, ఎక్స్ అఫిషియో ఓట్ల సహాయం తో అధికార పార్టీ , జూపల్లి వర్గం మద్దతు లేకుండానే చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది . అయితే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నాయకత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తన అనుచరులను బరిలోకి దించి గెల్పించుకున్న జూపల్లి, ప్రస్తుతం తెలంగాణ లో  జరుగుతున్న సహకార పరపతి సంఘాల ఎన్నికల్లోను తన అనుచరులను బరిలోకి దించారు .

 

దీనితో మున్సిపల్ ఎన్నికల్లో మాదిరిగానే జూపల్లి వర్గీయులు సహకార ఎన్నికల్లో  గెలుస్తారా ?, లేకపోతే ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బరిలోకి దించిన అభ్యర్థులు విజయం సాధిస్తారా?? అన్నదిప్పుడు హాట్ టాఫిక్ గా మారింది . ఒకవేళ ఈ ఎన్నికల్లోను జూపల్లి వర్గీయులు విజయం సాధిస్తే , ఇక పార్టీ నాయకత్వం దృష్టిలో reddy BEERAM' target='_blank' title='హర్షవర్ధన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>హర్షవర్ధన్ రెడ్డి పని అయిపోయినట్లేనని , అలాకాదని తన అనుచరులను గెలిపించుకుంటే మాత్రం , జూపల్లికి ఇబ్బందులు తప్పవని అధికారపార్టీ వర్గాలు అంటున్నాయి .  

మరింత సమాచారం తెలుసుకోండి: