వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ 10 నెలల్లో సీఎం జగన్ అనేక సంచలన నిర్ణయాలు, ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేశారు. వాస్తవానికి జగన్ ఈ 10 నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏపీలో గత సీఎంలు ఎవరు చేయలేదనే చెప్పొచ్చు. అలాగే దేశంలో ఏ సీఎం చేయని విధంగా రాష్ట్రాభివృద్ధి కోసం మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారు.

 

అయితే ఆయన ఎంత గొప్పగా కార్యక్రమాలు చేసిన, అనుకున్నంత స్థాయిలో ప్రభుత్వానికి మైలేజ్ మాత్రం వచ్చినట్లు కనిపించలేదు. ఎందుకంటే జగన్ ఏ కార్యక్రమం చేసిన టీడీపీ దాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంది. ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో సానుకూలత మాత్రం రానివ్వకుండా చూసుకున్నారు. అలాగే టీడీపీ అనుకూల మీడియా కూడా వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విష ప్రచారం చేసింది. ఇక చంద్రబాబు అయితే రోజు ప్రెస్ మీట్లు పెడుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయాలపై నెగిటివ్ పెరిగేలా మాట్లాడుతున్నారు.

 

ఇక టీడీపీ వాళ్ళు చేసే విషప్రచారాన్ని వైసీపీ నేతలు పెద్దగా తిప్పికొట్టలేకపోయారని వాదన కూడా ఉంది. ముఖ్యంగా మంత్రుల్లో నలుగురైదుగురు తప్ప, మిగతా వాళ్ళు పెద్దగా టీడీపీకి ధీటుగా వెళ్ళినట్లు కనిపించలేదు. అందుకే కొన్ని కొన్ని సందర్భాల్లో జగన్‌తో క్లాస్ పీకించుకున్నారు. అయితే రాను రాను టీడీపీ విష ప్రచారం పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఓ ఊహించని స్టెప్ తీసుకొనున్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు అయిన దగ్గర నుంచి, స్వయంగా ఆయనే తరుచుగా మీడియా సమావేశాలు పెట్టి టీడీపీకి కౌంటర్ ఇస్తారని సమాచారం.

 

సాధారణంగానే జగన్ మీడియా సమావేశాలు ఎక్కువ పెట్టారు. అసలు సీఎం అయ్యాక అలాంటి కార్యక్రమం ఏమి చేయలేదు. కానీ తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో టీడీపీ కుట్ర ఉందనే ఉద్దేశంతో, దాన్ని ప్రజలకు వివరించాలని మీడియా సమావేశం పెట్టారు. ఇక ఇదే విధంగా భవిష్యత్‌లో కూడా మరి ఇబ్బందికర సమస్య వచ్చినప్పుడు జగన్ స్వయంగా రంగంలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: