కరోనా వ్యాప్తి నేపథ్యలో సోషల్ మీడియాలో అనేక పోస్టులు చక్కర్లు కొడుతుంటాయి. అందులో కొన్ని సిల్లీగా ఉంటే.. మరికొన్ని చాలా అర్థంతంగా ఉంటాయి. అలాంటి ఓ సందేశాన్ని ఇవాళ ప్రధాని మోడీ దేశ ప్రజల ముందు ఉంచారు. ఎలాంటి క్లిష్టమైన అంశాన్నైనా తన ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడం రాజకీయ నాయకుడికి చాలా అవసరమైన నైపుణ్యం.

 

 

అది మోడీకి చాలా ఉందన్న సంగతి తెలుసు. కరోనా ప్రభావంతో ఏకంగా దేశాన్ని 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన మోడీ.. 21 రోజులూ ఏం చేయకూడదో ఓ ప్ల కార్డు ద్వారా చెప్పేశారు. హిందీలో రాసి ఉన్న ఆ ప్ల కార్డు , అందులోని సందేశం ఆలోచింప జేసేవిగా ఉన్నాయి. ఇంతకీ ఆ ప్ల కార్డు పై ఏ ముందో తెలుసా.. కో.. అంటే కోయీ.. రో అంటే రోడ్‌ పర్.. నా అంటే నా నికలే.. అంటే ఎవరూ కూడా రోడ్డు మీదకు రావద్దు.. అన్న సందేశాన్ని సింపుల్ గా చెప్పేశారు మోడీ.

 

IHG

 

ఇది కర్ఫ్యూ తరహా వాతావరణమన్న మోదీ.. ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారు. 21 రోజులు జాగ్రత్తలు తీసుకోకుంటే తర్వాత మన చేతుల్లో ఏం ఉండదని వార్నింగ్ ఇచ్చేశారు. కొన్నాళ్లపాటు ఇంటి నుంచి బయటకు వెళ్లాలనే ఆలోచన మానుకోవాలని.. ప్రజలంతా ఒకే పని చేయాలి.. ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

 

 

ఈ లాక్‌డౌన్‌ నిర్ణయమే ప్రతి ఇంటికి లక్షణరేఖ అని ధాని నరేంద్ర మోదీ తెలిపారు. జనతా కర్ఫ్యూని ఆబాలగోపాలం కచ్చితంగా పాటించారు. అలాగే కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుని తీరాలి. కొంత మంది నిర్లక్ష్యం ప్రజలందరినీ ప్రమాదంలోకి నెడుతుంది. ఈ నిర్లక్ష్యం కొనసాగితే దేశం భరించలేనంత మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటుంది. ఇళ్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధమని తెలిపారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: