రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. కరోనా దెబ్బకు కొందరు మాంసం, గుడ్లు తినడం మానేశారు. చికెన్ తింటే కరోనా సోకుతుందని వదంతులు వైరల్ కావడంతో చాలామంది చికెన్ తినడం కూడా మానేశారు. ముక్క లేనిదే ముద్ద దిగని వారు కూడా నేడు కూరగాయలు, పప్పుతో భోజనం చేస్తున్నారు. అమెరికా, స్పెయిన్, ఇటలీ దేశాలలో వేల సంఖ్యలో కరోనా భారీన పడి మృతి చెందుతున్నారు. 
 
చైనాలోని షెకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు ఏ మాంసం వల్ల కరోనా సోకిందో తెలుసుకోవాలని పలు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో పిల్లి, పాము, గుర్రం, గాడిద, గబ్బిలం, అలుగు, పంది, కుక్క మాంసంలో కరోనా వైరస్ ఉందని తేలింది. అక్కడి వైద్యులు వీటి మాంసం ద్వారా కరోనా సోకి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన వుహాన్ సిటీలో అలుగు, గబ్బిలం, గాడిద, గుర్రం, పాము, కుక్క, పిల్లి, పంది మాంసం ఎక్కువగా తింటారు. 
 
మరికొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్ జీన్స్ ఈ కొత్త వైరస్ పుట్టుకకు కారణమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా కొన్ని జాతులకు చెందిన పాములు గబ్బిలాలను వేటాడి జీవిస్తాయి. గబ్బిలాన్ని తిన్న పాము మాంసాన్ని మనుషులు తినడం వల్ల ఈ వైరస్ పాకిందని మరికొంతమంది చెబుతున్నారు. కరోనా దేశంలో వేల సంఖ్యలో ప్రాణాలను బలిగొనడంతో చైనాలో జంతువుల మాంసాన్ని ఎవరూ ముట్టుకోవడం లేదు. 
 
మరోవైపు భారత్ లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కేంద్రం ముందుజాగ్రత్తచర్యల్లో భాగంగా లాక్ డౌన్ ప్రకటించినా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కు చేరగా ఏపీలో ఇప్పటివరకూ 14 కేసులు నమోదయ్యాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: