దేశ వ్యాప్తంగా కరోనా విస్తృతిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14  వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించింది .   కరోనా బాధితుల సంఖ్య  రోజుకింత పెరుగుతున్న నేపధ్యం లో లాక్ డౌన్ ను మరింత కాలం పొడిగించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి . అయితే లాక్ డౌన్ పొడగింపుకు కేంద్రం ఏమాత్రం సుముఖంగా ఉన్నట్లు కన్పించడం లేదు . ఈ విషయాన్ని ఇప్పటికే సూచనప్రాయంగా కేంద్రం వెల్లడించింది . లాక్ డౌన్ అన్నది కరోనా వ్యాధి విస్తృతిని అడ్డుకోవడానికి తీసుకున్న తాత్కాలిక నిర్ణయం మాత్రమేనని , ఇదే పరిష్కారం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నాడు .

 

లాక్ డౌన్ తొలగించిన తరువాత కరోనా వ్యాధి మరింత విజృభించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు . అప్పుడే ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయన్నదానిపైనే సర్వత్రా చర్చ కొనసాగుతోంది . లాక్ డౌన్ ఎత్తివేయకముందే, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోబోయే చర్యలకు  ప్రజల్ని మానసికంగా సన్నద్ధం చేయాలని సూచిస్తున్నారు . ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండడం తో వలస కూలీలు , ఉపాధి కార్మికులంతా స్వీయ నిర్బంధం లో ఉంటూ ,  సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారని, ఒక్కసారి లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత వాళ్లంతా తమ , తమ పనుల్లో నిమగ్నమై సామాజిక దూరాన్ని పాటించే అవకాశాలు తక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు .

 

వలస కూలీలు , ఉపాధి కార్మికుల భృతి దెబ్బతినకుండానే , వైరస్ వ్యాప్తిని ఎలా అరికట్టడమన్న దానిపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అంటున్నారు . దానికి కూలీలను , ఉపాధి కార్మికులను  ఈ   లాక్ డౌన్ కాలం లోనే సన్నద్ధం చేయాలని , అలాగే పట్టణ ప్రాంత ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వెల్లడించాలని సూచిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: