కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే   12 లక్షలమందికి ఈ కరోనా వైరస్ వ్యాపించింది. ఇంకా అందులో ఏకంగా 65 వేలమంది మృతి చెందారు. భారత్ లో కూడా ఈ కరోనా వైరస్ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. 

 

కేంద్ర ప్రభుత్వకరోనా వైరస్ వ్యాప్తిని నివారించాలి అని దేశవ్యాప్తంగా 21 రోజులు పాటు లాక్ డౌన్ విధించారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

 

ఇంట్లో లైట్లు అన్నీ ఆఫ్ చేసి కొవ్వొత్తులు, దీపాలు, ఫ్లాష్ లైట్లు వెలిగించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రజలు కరోనాపై పోరుకు స్పూర్తినిస్తూ ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించాలని సూచించారు. జాతి ఐక్యతా సందేశం కోసం మోదీ దీపాలను వెలిగించాలని పిలుపునిచ్చారు. అయితే ఇప్పటికే ప్రజలంతా కూడా కరోనాపై పోరాటం చేస్తూ హ్యాండ్ శానిటైజర్ల వినియోగం ఎక్కువ అయ్యింది. 

 

అయితే మోడీ పిలుపు మేరకు ఇంట్లో లైట్లు అన్ని అపి దీపాలు వెలిగించే సమయంలో శానిటైజర్ కాకుండా హ్యాండ్ వాష్ వినియోగిస్తే మంచిది. ఎందుకంటే శానిటైజర్ కు మండే గుణం ఉంటుంది. అందుకు గాను శానిటైజర్ వాడకుండా ఉంటే మంచిది. దీపాన్ని జాగ్రత్తగా వెలిగించండి.. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: