కరోనా ప్రభావం తెలుగు మీడియాపై బాగానే ఉంటుందని కొన్ని రోజులుగా చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పటికే అన్ని ప్రధాన దినపత్రికలు జిల్లా టాబ్లాయిడ్ లను ఎత్తేశాయి. ప్రధాన పత్రికలోనే ఎడ్జస్ట్ చేసేశాయి. ఈనాడు వంటి దిగ్గజ పత్రిక సైతం 12 నుంచి 14 పేజీల్లోనే అన్ని శీర్షికలను సర్ది ప్రింట్ చేసేస్తోంది. ఇప్పటికి ఇలాంటి షాకులిచ్చిన దిన పత్రికలు ఆదివారం ఇంకో షాక్ ఇచ్చేశాయి.

 

 

సాధారణంగా ఆదివారం వచ్చిందంటే.. ఇంట్లో సందడే వేరు. ఆ సందడికి ఆదివారం ప్రత్యేక అనుబంధం ఎంతో ముడిపడి ఉంది. కవర్‌ స్టోరీలు ఫాలో అయ్యేవారు కొందరైతే... పద వినోదం వంటి మెదడుకు మేత పెట్టే పజిల్స్ వైపు మొగ్గుచూపేవారు ఇంకొందరు. మరికొందరికి సక్సస్ స్టోరీలంటే భలే ఇష్టం. ఇలా ఆదివారం చాలా ఇళ్లలో ప్రత్యేక అనుబంధంతో ఎంతో అనుబంధం ఉంటుంది. ఇప్పుడు అన్ని ప్రధాన పత్రికలు ఆదివారం ప్రత్యేక అనుబంధానికి సెలవిచ్చేశారు.

 

 

ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండు పత్రికలు ఈ ఆదివారం పాఠకులకు సండే మేగజైన్ లేదని సారీ చెప్పేశాయి. ఇక సాక్షి మాత్రం సండే మేగజైన్‌ ను కూడా మెయిన్‌ పేజీల్లోనే కుదించేసింది. ఇక ఈనాడు ప్రత్యేక పేజీలను ఇంటర్ నెట్ ఎడిషన్‌లో చదువుకోండంటూ సలహా ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటోంది. ఇవీ ఇప్పటికి పత్రికల కరోనా కష్టాలు. పత్రికలతో పాటు వాటికి దశాబ్దాలుగా అలవాటు పడిన పాఠకుల ఇబ్బందులు.

 

 

మరి ప్రింట్ మీడియాలో ఇంకెన్ని మార్పులు వస్తాయో..! ఇప్పుడు వచ్చిన మార్పులు శాశ్వతమా..? లేక లాక్‌ డౌన్‌ ఎత్తేయగానే సాధారణ స్థితికి వచ్చేస్తాయా..? అనుమానమే..చూడాలి ఇంకెన్ని మార్పులుంటాయో. ఏదేమైనా ఇది ప్రింట్ మీడియాకు గడ్డు కాలమే. ఇదే సమయంలో డిజిటల్ మీడియా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. కొత్త పుంతలు తొక్కుతూ పాఠకులను ఆకర్షించే పనిలో పడింది.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: