గత కొంత కాలంగా ఏపీ ప్రత్యేక హోదాపై రక రకాల విమర్శలు, ధర్నాలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా అప్పట్లో తీర్మానం చేశారు. ఇప్పుడు ఎన్డీఏ పాలన వచ్చిన తర్వాత ఈ విషయం ఇప్పటికీ ఎటూ తేలడం లేదు. తాజాగా ఈ విషయం పై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏపీ ప్రత్యేక హోదాపై చాలా ఘాటుగా స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్పపుడు తెలుగు వాళ్లు నన్ను కాదన్నారని అందుకే నేను కర్ణాటకు వెళ్లాల్సి వచ్చిందని తను కర్నాటక నుండి రాజ్యసభకు వెళ్లానని అన్నారు.


ఏపీ ప్రత్యేక హోదాపై వెంకయ్యనాయుడు


తనను ఏపీ ప్రత్యేక హోదా గురించి నన్ను అడగడం సబబు కాదని, నేను ఒక్క ఆంధ్రపదేశ్ రాష్ట్రానికే మంత్రిని కాదని, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు మంత్రినని అన్నారు. అన్ని రాష్ట్రాల గురించి పట్టించుకోవాల్సి వస్తుందని ఎక్కడ కూడా పక్షపాత వైఖరి ప్రదర్శించినా అది కేంద్ర ప్రభుత్వానికే మచ్చ తెచ్చిన వాన్ని అవుతానని అన్నారు. యూపీఏ చేసిన తప్పు వల్లే తమ ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే ప్రత్యేక హోదా సాధించలేకపోయామని వివరించారు. ప్రత్యేక హోదా పొందే అంశాలేవీ ఏపీకి లేవని, లోటుబడ్జెట్‌ అన్న ఒక్క అంశమే ప్రత్యేక హోదా అడగటానికి కారణంగా ఉందని వెంకయ్య అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: