అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ కార్యదర్శి, చంద్రబాబు తనయుడు పెద్దగా హడావిడి చేయలేదు. కార్యక్రమ నిర్వహణలో నేరుగా వేలు పెట్టకుండా పర్యవేక్షణకే పరిమితమయ్యారు. తాను కూడా ముందువరుసలోనే కూర్చొని కార్యక్రమాన్ని ఆస్వాదించారు. 

అయితే ఈ కార్యక్రమంలో లోకేశ్ పలువురు ప్రముఖులను కలుసుకున్నారు. శంకుస్థాపనకు ప్రముఖులు బారులు తీరడంతో వారితో లోకేశ్ కొద్దిసేపు ముచ్చటించారు. ఐతే.. వేదికపైనున్న మీడియా పెద్దలతోనూ లోకేశ్ మంతనాలు జరిపారు. ప్రత్యేకించి టీవీ9 రవి ప్రకాశ్ తో లోకేశ్ కొద్దిసేపు చర్చించడం ఆసక్తిరేపింది. 

టీవీ9 ఈ స్థాయిలో ఉందంటే అందుకు ప్రధాన కారకుడు రవిప్రకాశేనన్న సంగతి అందరికీ తెలిసిందే. మూస పద్దతికి బ్రేక్ చెప్పి.. సంచలనాల బాట పట్టించి.. తెలుగు జర్నలిజానికి గ్లామర్ అద్దిన వ్యక్తి రవిప్రకాశ్. చాలాసార్లు విమర్శల పాలైనా.. అతి చేస్తారని జనం తిట్టుకుంటూనే టీవీ9 చూడకుండా ఉండలేకపోవడమే రవిప్రకాశ్ సక్సస్ కు ఉదాహరణ.

మొదటి నుంచి ఏపార్టీకీ కొమ్ముకాయకుండా వస్తున్న టీవీ9 ఎన్నికలకు ముందు నుంచి కాస్త ట్రెండ్ మార్చింది. క్రమంగా పచ్చ మీడియా జాబితాలో చేరిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఆ మీడియా కథనాలూ అలాగే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో లోకేశ్, రవిప్రకాశ్ ల భేటీని ఎలా అర్థం చేసుకోవచ్చో..!?


మరింత సమాచారం తెలుసుకోండి: