ప్రకృతి కోపిస్తే ఎంతటి వారైనా దాని ముందు తల వంచక తప్పదు.. అయితే ఈ సంవత్సరం నేపాల్ లో జరిగిన ఘోర విపత్తు మరువక ముందే.. ఉత్తరాధి భారత దేశంలో, పాకిస్థాన్,అఫ్గనిస్తాన్ పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించిన చాలా పెద్ద ఎత్తున్న ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంబవించింది. ఉత్తర భారతదేశాన్ని సోమవారం భూకంపం కుదిపేసింది..  ఢిల్లీలో భూకంపం తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలిసింది. భూకంపం దాటికి జనం ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఢిల్లీలో మెట్రో రైళ్లను నిలిపివేశారు. ఢిల్లీతో పాటు జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్,పంజాబ్, హర్యానాలో స్వల్పంగా భూమి కంపించింది.

ప్రధానంగా జమ్మూకాశ్మీర్‌లో పెద్ద ఎత్తున భవనాలు దెబ్బతినగా, అధికారులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం ఇద్దరు మృతి చెందారు. మరో 69మంది గాయపడగా, ఇందులో 32 మంది విద్యార్థులున్నారు.  హిందూ కుష్ పర్వతాలు కేంద్రంగా పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైంది. భూకంపం ధాటికి ఉత్తరాది రాష్ట్రాలు నిమిషం పాటు కంపించిపోయాయి. భూకంప తీవ్రతకు భవనాలు వణికిపోయాయి. దీంతో ఢిల్లీ సహా ఉత్తరాదిన ఉన్న పలు పట్టణాల్లో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం పాక్, అఫ్ఠాన్ లలో పెను విషాదాన్ని మిగిల్చింది.

అఫ్గాన్ ఈశాన్య ప్రాంతంలో.. అఫ్గాన్-పాక్ సరిహద్దులో.. హింద్‌కుష్ పర్వతశ్రేణుల్లో..ఈ ప్రభావం ఎక్కువ ఉంది. భూకంపం కారణంగా 270 మంది చనిపోయినట్టు అంచనా. ఈ ఘటనలో పాకిస్థాన్‌లో 200 మంది, అఫ్గానిస్థాన్‌లో 63 మంది, భారత్‌లోని జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క పాకిస్థాన్‌లోనే దాదాపు 1300 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చు. వేల సంఖ్యలో భవనాలు, ఇండ్లు కుప్పకూలాయి. గాయపడినవారి సంఖ్య వేలల్లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. శిథిలాల తొలగింపు మొదలైతే మృతుల సంఖ్య మరింత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.

ప్రకృతి బీభత్సం.. చికిత్స పొందుతున్న బాధితులు


జమ్మూ పరిధిలోని కిష్ట్‌వర్, దోడా జిల్లాల్లో పాఠశాలలు, ఆస్పత్రులు, ఇళ్లు, ఇతర నిర్మాణాలతో కలిపి దాదాపు 400 భవనాలు దెబ్బతిన్నాయి. ఇందులో భదర్వాలోని రెండు పాఠశాలలు కూడా ఉన్నాయి.  ఈ ఘటనలు తప్ప భారత్‌లోని మిగతా రాష్ట్రాల్లో ప్రాణనష్టం సంభవించిన దాఖలాల్లేవు.ఇక పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా భూమి కంపించింది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ 30 సెకండ్లపాటు ప్రకంపనలు తాకాయి. జమ్మూకాశ్మీర్‌లోని భదర్వా ప్రాంతంలో ఓ ఆసుపత్రి వెలుపల చికిత్స పొందుతున్న భూకంపం బాధితులకు వెంటనే సహాయక చర్యలు ఏర్పాటు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: