గుజరాత్ లో గతంలో మోడీ పేరు మారు మోగేది ఇప్పుడు హార్థిక్ పటేల్ అనే యువ నాయకుడి పేరు మారుమోగుతంది.. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్థిక్ పటేల్ ఈ మద్య బాగా పాపులర్ అయ్యారు. అంతే కాదు పటేళ్లను ఓబీసీ రిజర్వేషన్లు లో కలపాలని ఆయన పోరాటం కూడా చేస్తున్నారు. ఒక దశలో ప్రభుత్వానికి కొరకరానిక కొయ్యలా మారాడు.  ఓబీసీ రిజర్వేషన్లు సాధించుకునేందుకు పటేల్ సామాజిక వర్గాన్నంతటినీ ఒకతాటిపైకి తెచ్చిన యువ సంచలనం హార్దిక్ పటేల్‌ను గుజరాత్ ప్రభుత్వం కట్టడి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది.

ఆ మద్య హార్థిక్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.. పటేల్ యువకులు ఎవరూ ఆత్మహత్య చేసుకోరాదని, అవసరమైతే ఇద్దరు పోలీసులను చంపాలంటే హార్దిక్ చేసిన వ్యాఖ్యలపై సూరత్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఇక రాజ్కోట్లో జరిగిన భారత్, దక్షిణాఫ్రికాల వన్డే సందర్భంగా జాతీయ జెండాను అవమానించాడంటూ మరో కేసు నమోదైంది. దీన్ని సవాల్ చేస్తూ హార్దిక్ హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్ను కొట్టివేసింది.

తాజాగా హార్దిక్ పటేల్కు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన దేశద్రోహం కేసును సవాల్ చేస్తూ హార్దిక్ వేసిన పిటీషన్ను హైకోర్టు తిరస్కరించింది. సూరత్లో హార్దిక్పై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  త్రివర్ణ పతాకాన్ని అవమానించారని పేర్కొంటూ దేశ ద్రోహం కింద అరెస్టు చేసిన హార్దిక్ పటేల్‌కు పోలీసు కస్టడీ మరో వారం రోజుల పాటు అహ్మదాబాద్ కోర్టు పొడగించింది.

హార్దిక్ పటేల్ జైలుకు తరలిస్తున్న దృశ్యం


హర్దిక్ పటేల్‌ను 14 రోజుల పాటు కస్టడీకి కావాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్.జే.బ్రహ్మభట్ వారం రోజుల పాటు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు  రాష్ట్రంలోని పటేల్ సామాజిక వర్గం వారికి తక్షణం ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో తాము మతం మార్చుకునేందుకు సైతం ఏమాత్రం వెనుకంజ వేయబోమని సూరత్‌కు చెందిన 500 కుటుంబాలకు చెందిన ప్రజలు సిద్ధంగా ఉన్నట్టు ఆ సమితి ప్రతినిధులు స్పష్టంచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: