తెలంగాణ లో మ‌రో ఆశ‌క్తి క‌ర చ‌ర్చ ఎంటంటే.. జ‌న‌సేన పార్టీ ఇక తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటికి దిగ‌నుందా? అన్న అనుమానాలకు తెర లేసింది. ఎందుకుంటే తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నిక సంఘం ప‌వ‌న్ కళ్యాణ్ జ‌న‌సేన పార్టీకి రాజ‌కీయ పార్టీగా గుర్తింపు నిచ్చింది. ఈ మేర‌కు ప్ర‌త్యేక  గుర్తులేని పార్టీగా జ‌న‌సేనను న‌మోదు చేసుకున్నట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక‌పోతే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ - తెలంగాణ లోనే కాకుండా తెలుగువారిలో విప‌రీత‌మైన ప్యాన్స్ పాలోయింగ్ ఉంది. మెగా స్టార్ చిరంజీవి త‌మ్ముడుగానే కాకుండా ఆయ‌న కంటు  ఓ ప్ర‌త్యేక‌మైన అభిమానుల‌ను ఏర్పరుచుకున్నారు. తాజా యువ హీరోల్లో ఎక్కువ  క్రేజ్ ఉన్న పాపుల‌ర్ హీరో ఎవ‌రంటే ముమ్మాటికి ప‌వ‌న్ కళ్యాణ్ అనే చెప్పాలి. అంతేకాకుండా కొంచెం ముందుకు వెళ్లితే..త‌న అన్న చిరంజీవి కంటే.. ప‌వ‌నే బెట‌ర్ అనే వారు చాలా మందే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఏర్ప‌రిచిన జ‌న‌సేన పార్టీ ప్ర‌స్తుతం తెలంగాణ‌ రాజ‌కీయాల్లో అడుగు పెట్టి క్రియాశీలంగా వ్య‌వ‌హారించ‌నుంద‌ని భావ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.


వ‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌శ్నించేందుకు


వ‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌శ్నించేందుకు అంటూ గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌న‌సేన పేరుతో ప‌వ‌న్ సొంత పార్టీని స్థాపించారు. అయితే గ‌త 2014 సార్వ‌త్రిక  ఎన్నిక‌ల్లో త‌న అన్న‌య్య చిరంజీవి వ్య‌తిరేకంగా బీజేపీ- టీడీపీల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేశారు. ఆ రెండు పార్టీల‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చ‌డంలో క్రియాశీల పాత్ర ను పోషించారు. అనంత‌రం అడ‌పా ద‌డ‌పా త‌ప్పా ప‌వ‌న్ పెద్ద‌గా రాజకీయ కార్య‌క‌లాపాల్లో పాల్గొన‌లేదు. కానీ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పూర్తి స్థాయిలో కాకుండా కొంత వ‌ర‌కు స్పందించారు. న‌వ్యాంధ్ర కొత్త రాజ‌ధాని కోసం రైతుల భూముల‌ను ఆ రాష్ట్ర‌ప్ర‌భుత్వం తీసుకున్న ల్యాండ్ పూలింగ్ పై ఆయ‌న స్పందించి రైతుల‌కు ఆదుకున్నారు. రైతుల నుంచి బ‌ల‌వంతంగా భూములను తీసుకుంటే స‌హించేది లేద‌ని చెప్ప‌డంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కొంత వ‌ర‌కు వెన‌క్కు త‌గ్గింది. అంతేకాకుండా కేంద్ర బీజేపీ పార్టీ పై తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడ్డారు. 


ఆంధ్ర‌ప్ర‌దేశ్ పునర్వీభ‌జ‌న చ‌ట్ట ప్ర‌కారం ఏపీ కి ప్ర‌త్యేక హోదా ను ఎందుకు ఇవ్వ‌డంలేద‌ని ప్ర‌శ్నించారు. ఏపీ ప్ర‌జ‌లకు ప్ర‌త్యేక‌హోదా ను ఇచ్చి తిరాల్సిందే న‌ని తెలిపారు. కానీ ఈ వ్య‌వ‌హారంలో ప‌వ‌న్ పూర్తిస్థాయిలో పూర్తి స్థాయిలో స‌క్కెస్ కాలేక‌పోయారు. ఇక‌పోతే.. ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీ దాదాపుగా రెండు సంవ‌త్స‌రం దాటిపోయింది. కానీ ఇంత వ‌ర‌కు తెలంగాణ‌లో కానీ, ఇక్క‌డి ప్రాంతాల స‌మస్య‌ల‌పై స్పందించిన దాఖలు లేవు. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోరుతున్నాని మాత్రం చెబుతూ వ‌చ్చారు. త‌ప్పా..ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా ఏ నాడు రాలేదు. ఇక‌పోతే ఆయ‌న ఏపీలోనే కాదు.. తెలంగాణ‌లో సైతం ఫ్యాన్స్ ఎక్కువే. అంతేకాకుండా రాజ‌ధాని లో ఆయ‌న కున్నా క్రేజ్ ఇంతా అంతా కాదు. ఇక త‌న ఫ్యాన్ చిన్నారి శ్రీజ  కోసం ఖ‌మ్మం వెళ్లి చావు బ్ర‌తుకులో ఉన్న  ఆమె ను  ఓదార్చి తెలంగాణ లో మంచి పేరే తెచ్చుకున్నారు. అంతేకాకుండా శ్రీజకు అండ‌గా ఉంటాన‌ని హామీ సైతం ఇచ్చారు. ఇక‌పోతే.. త‌న అన్నయ్య, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాజ్య‌స‌భ సభ్యుడు చిరంజీవి పై తెలంగాణ లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. 


ఈ త‌రుణంలో ఆయ‌న అన్న‌య్య‌కు వ్య‌తిరేకంగా పార్టీ పెడ‌టం తెలంగాణ‌లో ఒకింత ప్ల‌స్ పాయింటే. ఇక ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప‌వ‌న్ ఎనాడు అడ్డు చెప్ప‌లేదు. కానీ విభ‌జ‌న మాత్రం ఏక ప‌క్షంగా జ‌రిగింద‌ని మాత్రం ఆరోపించారు. విభ‌జ‌న‌తో ఆంధ్ర‌ప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసింద‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ గా అధికారిక గుర్తింపు లేన‌ప్ప‌టికి ప‌వ‌న్ ప‌రోక్షంగా రాజకీయాల్లో త‌న స‌త్తా చాటారు. ఇప్పుడు రాజకీయ పార్టీగా గుర్తింపు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడిగా ఉన్నందున ప‌వ‌న్ ప్ర‌తి కామెంటూ చ‌ర్య ఆస‌క్తిక‌ర‌మే  అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల సంఘం గుర్తింపు ఇవ్వ‌డం.. అది ప్ర‌స్తుత హాట్ హాట్ రాజ‌కీయాల స‌మ‌యంలో కావ‌డం కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది. ఇప్ప‌టికే వ‌రంగ‌ల్ పార్లమెంట్ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ అయి  నామినేష‌న్ల ప్ర‌క్రియ షురూ అయింది. ఈ ఎన్నిక‌ల్లో ఎన్టీఏ త‌ర‌పు అభ్య‌ర్థి బ‌రిలో ఉంటారని టీడీపీ అధినేత చంద్ర‌బాబు, టీటీడీపీ నేత‌లు ప్ర‌క‌టించారు.


అంతేకాకుండా నారాయ‌ణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గం ఉప ఎన్నిక ప్ర‌క‌ట‌న కూడా రాబోతుంది.  వీట‌న్నింటికీ మించి గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు  అధికార టీఆర్ఎస్ పార్టీ వేగంగా సిద్దమవుతుంది. అలాగే వ‌రంగ‌ల్, ఖ‌మ్మం మున్సిప‌ల్ ఎన్నిక‌లు వీట‌న్నింటికీ తోడు.. స‌న‌త్ న‌గ‌ర్- మ‌హేశ్వ‌రం- చేవెళ్ల- మ‌థోల్ శాస‌న స‌భ్యులు పార్టీ ఫిరాయించినందున వారిపై వేటు వేయాలంటూ  కాంగ్రెస్- టీడీపీలు స్పీక‌ర్ నుంచి మొదలుకొని  రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. ఈ ప‌రంప‌ర‌లో త్వ‌ర‌లోనే తుది నిర్ణ‌యం వెలువ‌డే అవ‌కాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కొంత వ‌ర‌కు తెలంగాణ ప్రాంతంలో వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. వ‌రంగ‌ల్ తెలంగాణ విద్యార్ధి నేత శృతి , విద్యాసాగ‌ర్ రెడ్డి ల ఎన్ కౌంట‌ర్, రైతుల ఆత్మ‌హ‌త్య లు ఆ పార్టీకి తీవ్ర న‌ష్ట‌మే తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాల‌న్నీ దాదాపుగా ఎక్కువ శాతం వెన‌క్కు తీసుకున్నారు. 


ఈ త‌రుణంలో తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌లు కొత్త నాయ‌కుడి కోసం ఎదురుచూపులు మొద‌లయ్యాయి. మొత్తంగా రాబోయే వ‌రుస ఎన్నిక‌ల వాతా వ‌రణం గ‌తంలో ప్ర‌క‌టించిన‌ట్టు ప‌వ‌న్ కాళ్యాణ్ ఒంట‌రిగా పోటీ చేస్తారా? 2014 ఎన్నిక‌ల మాదిరిగానే టీడీపీ - బీజేపీల‌కు మ‌ద్ద‌తిస్తారా?  తెలియాల్సి ఉంది. ఇక‌పోతే అయ‌న రాక తెలంగాణ ప్ర‌జ‌లు ఎలా స్పందిస్తార‌న్న‌ది కూడా ఆశ‌క్తిక‌రమే. కేవ‌లం ఫ్యాన్స్ పాలోయింగ్ త‌ప్పా.. మరేలాంటి రాజకీయ సంబంధాలు లేని ప‌వ‌న్ కు తెలంగాణ ప్రాంతంలో జ‌న‌సేన జెండా ఎలా ఎగ‌ర‌వేయనున్నారో చూడాలి. లేక ప్ర‌స్తుతం ఉన్న‌ట్లు సినిమా ల‌కు ఎక్కువ ప్రాధాన్యం రాజ‌కీయాల‌కు త‌క్కువ ప్రాధాన్యం ఇస్తారా  అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: