తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కలప్పించాలని ప్రతి పక్షాలు పోరు పెడుతున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పటికే ప్రత్యేక హోదా గురించి కొంత మంది ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే.. అంతే కాదు ప్రత్యేక హోదా గురించి సినీ నటుడు శివాజీ ఆమరణ నిరాహారదీక్ష,జలదీక్ష,నిరసనలు ఇలా రక రకాలుగా ప్రత్యేక హాదా కల్పించాలని పోరాడుతున్నారు.  మరోవైపు సినీనటుడు జనసేన అధ్యక్షులు కూడా ప్రత్యేక హోదా కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు.

ఇక  కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయం పై ఏమాత్రం స్పందించడం లేదు.. అంతే కాదు ప్రత్యేక హోదా కల్పించడం కుదరదని దాని బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అంటున్నారు.  దీంతో నిరాశ చెందిన కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. తాజాగా ప్రత్యేక హోదా కోసం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీకి హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన సుందరపు దుర్గాప్రసాద్‌(49) ప్రత్యేక హోదా కోసం ఆగస్టు 24న ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.  

ఏపీ ప్రత్యేక హోదా


దుర్గాప్రసాద్‌ కి మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌, ఏలూరు ఆసుపత్రులలో చికిత్స పొందాడు.  ఆయనకు భార్య జ్యోతి, కూతుళ్లు శ్రావణి, నిఖిల ఉన్నారు. ప్రసాద్ చేబ్రోలులోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. అయితే దుర్గాప్రసాద్‌ది ఆత్మహత్య కాదని, ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మండిపడ్డారు.  ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించడంతో ప్రజలు అభద్రతాభావానికి లోనవుతున్నారు. ప్రత్యేక హోదా రాకపోతే ఇక తమ పిల్లలకు ఉద్యోగాలు రావని బాధపడుతున్నారు.  దుర్గాప్రసాద్‌ పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించడంతో ఏలూరులో విషాదఛాయలు అలముకున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: