తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, వ‌రంగ‌ల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ‌య్య ఇంట్లో జ‌రిగిన ఘోర సంఘ‌ట‌న‌ను చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ త‌ప్పుచేసిందా లేకా.. తొంద‌ర‌ప‌డిందా అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్నం కాక త‌ప్ప‌దు. ఎలాగంటే.. సిరిసిల్ల రాజ‌య్య కుటుంబంలో త‌న కుమారుడైన సిరిసిల్ల అనిల్ భార్య సారిక కుమారులు అభిన‌వ్, ఆయోన్, శ్రీయోన్ లు ఇంట్లో అగ్రిప్ర‌మాదంలో స‌జీవ ద‌హ‌నం అయ్యారు. ఈ ఘోర సంఘ‌ట‌న‌తో తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశాన్ని సైతం క‌లిచివేసింది. ముక్కు ప‌చ్చ‌లార‌ని చిన్నారులు చ‌నిపోవ‌డం పై అక్క‌డి ప్రాంత ప్ర‌జ‌లు రాజ‌య్య పై తీవ్రంగా ఆగ్ర‌హిస్తున్నారు.  అయితే ఈ విషాద సంఘ‌ట‌న  జ‌ర‌గ‌క ముందు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ‌య్య కుమారుడు అనిల్ భార్య సారిక.. త‌న మామ‌య్య రాజ‌య్య కుటుంబం చాలా వేదిస్తున్నార‌ని, ఒక మ‌హిళగా త‌నను గ‌ర్తించ‌డంలేద‌ని, తాను బ్ర‌త‌క‌డానికి క‌ష్టంగా ఉంద‌ని, త‌న భ‌ర్త వేరే అమ్మాయితో సంబంధాలు పెట్టుకున్నార‌ని తెలిపింది.


మా మామ‌య్య రాజ‌య్య మంచివాడు కాద‌ని


మా మామ‌య్య రాజ‌య్య మంచివాడు కాద‌ని, నా స‌మ‌స్య ప‌రిష్క‌రించే వ‌ర‌కు త‌న మామ‌య్య‌కు ఎంపీ టిక్కెట్ ఇవ్వొద్ద‌ని ఎఐసీసీ కార్యాల‌యానికి సారిక మెయిల్ పెట్టినట్టు వార్త‌లు గుప్పుముంటున్నాయి. అయితే గ‌తంలో కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా వ‌రంగ‌ల్ ఎంపీగా గెలుపొందిన స‌మ‌యంలో త‌న పై తీవ్ర ఒత్తిడి పెరిగింద‌ని.. ఇక ఆయ‌న మ‌రోసారి ఎంపీ అయితే మ‌రోసారి నాపై ఒత్తిడి వచ్చే అవ‌కాశం ఉన్న నేపథ్యంలో త‌న‌కు కాంగ్రెస్ ఆభ్య‌ర్దిత్వాన్ని నుంచి తప్పించాల‌ని కోరింది. అయితే గ‌త 4 సంవ‌త్స‌రాల నుంచి రాజ‌య్య కు త‌న కొడ‌లు సారిక‌ల మ‌ధ్య తీవ్రమైన వాద‌న‌లే జ‌రుగుతున్నాయి. గ‌త సంవ‌త్స‌రంలో సారిక త‌న భ‌ర్త అనిల్, మామ‌య్య రాజ‌య్య  అత్త‌మ్మ‌ మాధ‌వి ల‌పై గృహ హింస 498ఎ కేసు పెట్టింది. ఇక కేసులో త‌నకున్న‌ రాజ‌కీయ బ‌లంతో త‌ప్పించుకున్నారు రాజయ్య‌. నాటి నుంచే రాజ‌య్య కుటుంబంలో చాలా పెద్ద క‌ల‌హాలే ఉన్నాయి.


ఇక‌పోతే ఈ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా లేకా తెలియ‌దా అన్న‌ది తెలియ‌ని ప‌రిస్థితి. ఒక‌వేళ తెలిసినా ఇంత వ్య‌వ‌హారం జ‌రుగుతున్నా..కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్నం కాక‌త‌ప్ప‌దు. ఇక‌పోతే ఈ వ్య‌వ‌హారం తెలియ‌లేదనుకుంటే..  తాజాగా  సారిక చనిపోక ముందుకు పూర్తి వివ‌రాల‌తో ఏఐసీసీ కార్య‌ల‌యానికి లేఖ రాసింద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న మామ‌య్య రాజ‌య్య‌తో త‌న‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని, ఒక మ‌హిళగానైనా న‌న్ను చూడ‌టంలేద‌ని తెలిపిందని స‌మాచారం. ఈ లేఖ‌తో నైనా కాంగ్రెస్ ఎదో ఒక నిర్ణ‌యాన్ని తీసుకునేది ఉండేన‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఒక‌వేళ  కుటుంబ క‌ల‌హాలు మేం జోక్యం చేసుకోబోం అన్న వాద‌న కూడా కాంగ్రెస్ నుండి రావ‌చ్చు. అయితే.. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున వరంగ‌ల్ ఎంపీ గా గెలిచిన రాజ‌య్య తన‌ను రాజ‌కీయ బ‌లంతో తీవ్రంగా ఒత్తిడిచేశాడ‌ని సారిక ఆరోపించింది. ఈ ఆరోప‌ణ‌కు కాంగ్రెస్ పార్టీ ఏం స‌మాధానం చెబుతుంది? ఈ విష‌యంపై ఎలాంటి నిర్ణ‌యాన్ని తెలుపుతుంది.


ఇది ఇలా ఉండ‌గా.. ఒక ప్రజా ప్ర‌తినిధిగా నిల‌బ‌డాల్సిన వ్య‌క్తి యొక్క న‌డ‌వ‌డిక, అత‌ను కొత్త నాయ‌కుడైనా.. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడైనా ఆయ‌న వ్య‌క్తిత్వం, ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కున్న పేరును, అంతేకాకుండా ఆయ‌న కుటుంబ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు సేక‌రించిన అనంత‌రమే పార్టీ అధిష్టానం అభ్య‌ర్ధిగా అర్హుడ‌ని ప్ర‌క‌టించి టిక్కెట్ ఖ‌రారు చేస్తుంది. కానీ ఇక్క‌డ వ్య‌వ‌హారం చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ చాలా తొంద‌ర‌ప‌డింద‌న్న విష‌యం బ‌య‌ట ప‌డుతుంది. త‌న స‌మ‌స్య‌ల‌ను సంపూర్ణంగా రాసి పార్టీ కార్యాల‌యానికి మెయిల్ పెట్టినా.. గ‌మ‌నించ‌కుండా పార్టీ సిరిసిల్ల రాజయ్య‌ను అభ్య‌ర్థి గా ప్ర‌క‌టించింద‌ని ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్త పరుస్తున్నారు. క‌నీసం ఓ అమ్మాయి త‌మ స‌మస్య‌ను ఒక పార్టీ అధిష్టానానికి విన్న వించుకుంటే స్పందించ‌ని కాంగ్రెస్ పార్టీ తీరు పై సామాన్య‌జ‌నం తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త ప‌రుస్తున్నారు.


అయితే తాజాగా సారిక మృతి చెందినరోజు ముందు సాయంత్రం రాజ‌య్య కుటుంబానికి సారిక‌కు మ‌ధ్య తీవ్ర మైన గొడ‌వ జరిగింద‌ని తెలుస్తోంది. ఈ గోడ‌వ‌కు మృతురాలు సారిక ఎఐసీసీ పెద్ద‌ల‌కు రాసిన లేఖ గురించి జ‌రిగింద‌ని విశ్వ‌స నీయ వ‌ర్గాల  స‌మాచారం. మంగ‌ళ వారం రోజున పార్టీ ప్ర‌చారం ముగించుకుని పొద్దు పోయాక ఇంటికి చేరుకున్నారు రాజయ్య‌. అయితే అంత‌కుముందే రాజయ్య భార్య మాద‌వి, కుమారుడు అనిల్ కొడ‌లు సారిక ల మ‌ధ్య గోడ‌వ జ‌రిగింది. రాజ‌య్య రాగానే గొడ‌వ మ‌రింత పెరిగిందని తెలుస్తోంది. పార్టీ టికెట్ కోసం ఒంట‌రిగా శ్ర‌మించి ఎలాగో లాగా టిక్కెట్ సాధించుకుంటే దానికి నీవు అడ్డుప‌డతావా అని కుమారుడు అనిల్ సారిక‌తో వాగ్వాధానికి దిగిన‌ట్టు తెలుస్తోంది. దీనికి సారిక త‌న‌ను త‌న పిల్ల‌ల‌ను ఆదేరీతి లో ప‌ట్టించుకుంటే స‌మస్యే లేదు క‌దా అని వారించిన‌ట్టు తెలుస్తోంది.


అంతేకాకుండా ఇలాగే త‌న‌ను విసిక్కిస్తే తాను మీడియా ముందుకు వెళ్ల‌తాన‌ని సారిక తెలిపిన్న‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలో రాజ‌య్య గొడవకు ఫుల్ స్టాప్ పెట్టి భార్య మాధ‌వి, కుమారుడు అనిల్ తో పైకి వెళ్లారు. దీంతో సారిక త‌న కొడుకుల‌తో తన ఇంట్లోకి వెళ్లి  నిద్ర కు ఉప‌క్ర‌మించింది. ఇంత‌లోనే ఈ ఘోరం జ‌రిగింది మ‌రోవైపు ఇది ముమ్మాటికి హాత్యే న‌ని ప‌లు మ‌హిళా సంఘాలు ఆరోపిస్తున్నారు. సారిక ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికిత‌నం లేద‌ని సారిక త‌ల్లి తండ్రులు తెలిపారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలిస్తే ప‌లు అనుమానాలు కూడా లేక‌పోలేదు.  పోలీసుల విచార‌ణ‌లో అస‌లు నిజం తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ఉద్ద‌తం పై తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ధ్రిగ్బాంతి కి ప్ర‌క‌టించినా.. మృతురాలు సారిక వ్రాసిన లేఖ పై ఎలాంటి స్పంద‌న రాలేదు.ఈ వ్య‌వ‌హారం పై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి. 



మరింత సమాచారం తెలుసుకోండి: