గుండెపోటుకు గురయినవారు సెక్సులో పాల్గొంటే ప్రాణాలకే ప్రమాదమని చాలాకాలంగా పుకార్లు వ్యాపిస్తూ వస్తున్నాయి. కానీ హృద్రోగులు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే అది వారి ఆరోగ్యానికి ఎంతో మంచిదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. హృద్రోగులు, వారి జీవిత భాగస్వాములు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే ప్రమాదకరమని భావించి శృంగారం జోలికే వెళ్లరని, తాము ఇటీవల చేసిన విస్తృత అధ్యయనం ప్రకారం అలాంటి ఆలోచనలన్నీ కేవలం భ్రమలుగా తేలిందని బ్రెజిల్ లోని రియో గ్రాండే ఫెడరల్ యూనివర్శిటీకి చెందిన ప్రధాన రచయిత రికార్డో స్టెయిన్ పేర్కొన్నారు.


ఆరోగ్యం స్థిరంగా ఉన్న హృద్రోగుల్లో చాలామందికి సెక్స్‌ లో పాలుపంచుకునే సమయంలో మరణం సంభవించే అవకాశం చాలా చాలా తక్కువని, మహిళలకయితే ఇది మరీ తక్కువని స్టెయిన్ పేర్కొన్నారు. లైంగిక కార్యకలాపం అనేది మానవ జీవితంలో అత్యంత ప్రధానమైన ఆరోగ్య సంబంద ప్రమాణానికి సూచికగా ఉంటుంది. పైగా సెక్స్‌ను జీవితంలోనే అత్యంత సంతోషకరమైన వ్యాయామంగా ఆరోగ్య సలహాదారులు చెబుతున్నారు.

హృద్రోగులు వ్యాధిని నయం చేసుకునే క్రమంలో చేసే వ్యాయామాల కంటే సెక్సులో పాల్గొనడం మంచి ఫలితాలను ఇస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు స్టెయిన్ తెలిపారు. వీధిలో చేసే బ్రిస్క్ వాక్‌తో సమానమైన ఫలితాలను భావ తృప్తి అందిస్తుందని చెప్పారు. హృద్రోగులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు వృత్తిగతమైన లైంగిక కార్యకలాపాన్ని కొనసాగించే దిశగా వైద్యులు తగు ప్రోత్సాహాన్ని అందించాలని ఈ అధ్యయనం సూచిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: