హిందువులకి అత్యంత పవిత్రమైన జంతువు ఏది అంటే వెంటనే  అందరూ చెప్పే పేరు ఆవు, దేవతలకి నిలయంగా దాన్ని పూజిస్తూ ఉంటారు హిందువులు. మనదేశం లో ఆవు మాంసం విషయంలో పెద్ద రచ్చే సాగుతోంది. ఆ మాంసం తినద్దు అని హిందూ వాదులు గొడవ చేస్తూ ఉండగా. ఆవు మాంసం తినడం మీద నిషేధం విధించడం అంటే సాధారణ మనుషుల హక్కులు హరించడం అని లౌకిక వాదులు గగ్గోలు పెడుతున్నారు.

 

 

ఈ నేపధ్యంలో ఆవు "అత్యంత ప్రమాదకర జంతువు" అంటూ సంచలన ప్రకటన వచ్చింది. భారత్ లో కాదు కానీ బ్రిటన్ లో ఈ విషయమై ఆదేశ ప్రభుత్వం కొత్త సూచన చేస్తోంది. బ్రిటన్ ఆరోగ్య భద్రతా విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే కుక్కలా కన్నా కూడా ఆవులే ఎక్కువ ప్రమాదకారులు అట. అదెలా అని చూస్తే రోడ్డు ప్రమాదాల కారణాలు ఆవుల వలనే ఎక్కువగా జరుగుతున్నాయి అని చెబుతున్నారు.

 

 

 గత పది సంవత్సరాల్లో డబ్భై ఐదు మంది ఆవుల దాడిలో ప్రాణాలు కోల్పోయారట. ఎక్కువగా పొలాల్లో ఉండే ఆవులు అక్కడ ఉన్నంతవరకూ సాదుజంతువులలాగా ఉంటాయి కానీ ఒక్కసారి అవి ఫుట్ పాత్ ఎక్కితే మాత్రం నడుస్తున్న వారి మీద తీవ్ర దాడులు చేస్తూ ఉంటాయి అని. టన్ను బరువు ఉండే ఈ ఆవులు నడుస్తున్న వారిని తొక్కి తొక్కి చంపడం లేక కొమ్ములతో పొడిచి చంపడం లాంటివి చేస్తూ ఉన్నాయి అని ఆ నివేదిక చెబుతోంది.

 

 

 వ్యయసాయ కార్మికులు దాదాపు యాభై ఆరు మంది వీటి దాడుల్లో మరణించారట. 2005 నుంచీ 2013 కీ మధ్య జరిగిన మరణాలలో 17 శాతం మంది ఆవుల వల్లనే చనిపోయారు అంటే దీని బట్టీ వారు ఆవు ని ఎంత ప్రమాదకర జంతువు గా పరిగణిస్తున్నారు అనేది చూడచ్చు.పశు సంపద ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి అని ఈ సంఘం రైతులకి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: