ఈ రోజు తెల్ల వారు జామున ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. సుమారు 155 మంది అమాయక ప్రజలను బలికోన్నారు. పారిస్‌లో ఉగ్రవాదు దాడితో ప్రపంచం అంతా  ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పారిస్‌లో  ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో 150  మందిని బలిగొన్న నేపథ్యంలో అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పారిస్‌లో ఉగ్రదాడి ఘటనతో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది.

దేశంలోని ముఖ్య ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక పోతే భారత దేశంలో కూడా ఉగ్రవాద దాడులు జరగవచ్చు అని ఇంటిలీజెన్స్ వర్గాలు ఎప్పటి నుంచో హెచ్చిరస్తూనే ఉన్నారు. 2008లో ముంబైలో ఇలాగే ఉగ్రవాదులు తాజ్‌హోటల్‌, ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినస్‌లో దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.

  పోలీస్ ఫోర్స్

more than 100 killed in paris attacks

ఇదేవిధంగా చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ నగర పోలీసు యంత్రాంగాలను కేంద్రం అప్రమత్తం చేసింది.  మరో వైపు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌తోపాటు పలు దేశాలు బస్సు టర్మినల్స్, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కటా నగరాలతోపాటు మిగతా నగరాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.మెట్రో స్టేషన్లు, రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ తదితర ప్రాంతాల వద్ద పోలీసుల గస్తీ పెంచారు. హోటల్స్‌, రద్దీగా ఉండే మార్కెట్‌ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: