ఇప్పటికీ నివారణ తప్ప మందు కనిపెట్టని భయంకరమైన వ్యాధుల్లో ఎయిడ్స్ ఒకటి. అలాంటి భయంకరమైన జబ్బు ఓ సూపర్ స్టార్ కు వచ్చిందన్న కథనం ఇంటర్ నెట్లో, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కలకలం రేపుతోంది. ఇంతకీ ఎవరా సూపర్ స్టార్ అని ఆలోచిస్తున్నారా.. మీకే కాదు.. ఈ సూపర్ స్టార్ ఎవరో ఇంకా ఎవరికీ క్లారిటీ లేదు. కానీ ఓ విషయం మాత్రం స్పష్టం. ఏంటంటే ఆ నటుడు హాలీవుడ్ సూపర్ స్టార్. 

ఐతే.. ఇష్యూ ఆ సూపర్ స్టార్ ఒక్కడిదే అయితే బాగానే ఉండేది. కానీ ఎయిడ్స్ సెక్స్ ద్వారా వ్యాపించే వ్యాధి కదా.. ఇప్పుడు సదరు హాలీవుడ్ స్టార్ తో సంబంధం ఉన్నవారందరికీ ఆ వ్యాధి సోకే ప్రమాదం ఉందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ హాలీవుడ్ స్టార్ తో ఎవరికి లింకులు ఉన్నాయి. ఎంత మందికి ఎయిడ్స్ సోకింది అన్న విషయాలు ఇప్పుడు హాలీవుడ్లో షాకింగ్ న్యూస్ అయ్యాయి. 

సదరు హెచ్‌ఐవీ కలిగిన  హాలీవుడ్ సూపర్ స్టార్ కు కనీసం 50 మంది సెలబ్రిటీలతో లైంగిక సంబంధాలు ఉన్నాయట. వారిలో ఐదుగురు పోర్న్ స్టార్లట. అంతేకాదు.. ఓ ప్రముఖ హాలివుడ్ నటి, ప్రముఖ టీవీ యాంకర్, మరో ప్రముఖ మీడియా జర్నలిస్ట్ కూడా ఈయన గారితో సంబంధం పెట్టుకున్నవారి జాబితాలో ఉన్నారట. ఆ స్టార్‌తో తనకు లైంగిక సంబంధాలు ఉన్నాయని.. తాను ఓ సారి గర్భవతిని కూడా అయ్యాయని, తప్పనిసరై అబార్షన్ చేయించుకున్నానని ఓ పోర్న్ స్టార్ తెలిపింది. అయితే లక్కీగా తనకు ఎయిడ్స్ లేదని చెప్పింది. 

ఇంతకూ హెచ్‌ఐవీ సోకిన ఆ హాలివుడ్ స్టార్ ఎవరనే దానిపై ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పలు ఊహాగానాలు వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కరి పేరు చెబుతున్నారు. ఎవరికీ దీనిపై క్లారిటీ లేదు. అంతేకాదు ఈ సూపర్ స్టార్ ఎయిడ్స్ వార్త.. హాలీవుడ్ పరిశ్రమపై కూడా తీవ్రప్రభావం చూపేలా కనిపిస్తోంది. సదరు సూపర్ స్టార్ తో సంబధం ఉన్న ఐదుగురు పోర్న్ స్టార్లు అప్పుడే పరిశ్రమను వదిలేసి వెళ్లిపోయారట. మరి ఈ ఎయిడ్స్ కథ ఏ తీరానికి చేరుతుందో..!?


మరింత సమాచారం తెలుసుకోండి: