న‌వ్యాంద్ర సీఎం నారాచంద్రబాబు నాయుడు తన పాలన వైఫ‌ల్యం, ప్ర‌జల‌కు పాల‌న సరిగా సాగ‌టంలేద‌ని, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను మ‌రిచార‌ని ప్ర‌తిప‌క్షాల‌ను రాద్దాతం చేస్తున్నాయి. అయితే దీనికి కార‌ణం ఏమిటో సీఎం చంద్ర‌బాబు తేల్చేశారు. వైఫ‌ల్యాల‌కు కార‌ణం చాటింపు వేసుకోవ‌డంలో వెనుకబ‌డిపోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని తెలిపారు. తిరుపతి జ‌రిగిన దిశానిర్దేశ స‌ద‌స్సులో మాట్లాడిన చంద్ర‌బాబు మ‌నం ప్ర‌జ‌లకోసం ఎంతో చేశాం.. కానీ చేసిందాన్ని చెప్పుకోలేక‌పోతున్నాం అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది ఇలా ఉండ‌గా.. చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై  ప‌లువురు  సెటైర్లు వేస్తున్నారు. చేసేది త‌క్కువ‌.. ప్ర‌చార్భాటం ఎక్కువ అని పేరుప‌డ్డ చంద్ర‌బాబు ఇంకా ప్ర‌చారం త‌క్కువ చేసుకుంటున్నాం అని మాట్ల‌డ‌టం హాస్యాస్ప‌దం గా ఉందంటున్నారు వారు. చంద్ర‌బాబు సంక్షేమ ప‌థ‌కాల‌కు పైసా విడుద‌ల చేయ‌లేదు. రైతుల రుణ‌మాపీ సంగ‌తి పూర్తిగా మ‌రిచిన‌ట్టే. బాబు వ‌స్తే జాబు అని చెప్పుకొచ్చారు. అదికారంలోకి వ‌చ్చి దాదాపు రెండు సంవ‌త్సరాలైనా ఒక్క జాబు కూడా ఇచ్చిన పాపాన పోలేదు.



క‌ట్టుబ‌ట్ట‌ల‌తో హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి వ‌చ్చామ‌ని


అంతేకాకుండా.. మ‌న పార్టీ అధికారంలోకి వ‌చ్చిన  ప్ర‌తీసారి ఆంధ్రాలో ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు చేప‌ట్టి, ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తూ వ‌స్తోంద‌ని అన్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత‌... క‌ట్టుబ‌ట్ట‌ల‌తో హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి వ‌చ్చామ‌ని అన్నారు. ఆశించిన సాయం ఎవ‌రి నుంచి అంద‌క‌పోయినా నిల‌దొక్కుకుంటున్నామ‌ని చెప్పారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంలో దేశంలోనే నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలుస్తున్నామ‌ని.. ఇన్ని చేస్తున్నా మ‌నం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో నాయ‌కుల విఫ‌మౌతున్నార‌నీ, చేస్తున్న‌వాటిని చెప్పుకోవ‌డం శ్ర‌ద్ధ పెట్టం లేద‌నీ, ఎప్పుడో ఐదేళ్ల త‌రువాత ఎన్నిక‌లు వ‌స్తాయి క‌దా, అప్పుడు చెప్పుకుందాం అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం సరికాద‌ని చంద్ర‌బాబు క్లాస్ తీసుకున్నారు. నాయ‌క‌త్వం అంటే అధికారం చెలాయించ‌డం కాద‌నీ ప్ర‌జ‌ల్లో నిత్యం మ‌మేక‌మై ఉండాల‌ని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అనుకూలించ‌కున్నా ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమలు చేస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు.


ఇక‌పోతే.. ఎన్నో భారీ ప‌రిశ్ర‌మ‌లు రాష్ట్రానికి వ‌స్తున్నాయ‌ని, వాటి ద్వారా ల‌క్ష‌ల మంది ఉపాధి  దొరుకుతుంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వంలో ఖాళీ  పోస్టుల‌నూ త్వ‌ర‌లో భ‌ర్తీ చేస్తామ‌న్నారు. ఈ విష‌యాల‌న్నీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు సూచించారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డం టీడీపీ కి కొత్తకాద‌న్నారు. పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ తొమ్మిది నెల‌ల పాటు ప్ర‌జ‌ల మ‌ధ్యే గ‌డిపి ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌రువాతే ఇంటికి చేరుకున్నార‌ని గుర్తు చేశారు. ఈ స్పూర్తిని ప్ర‌తి నాయ‌కుడు, కార్య‌కర్త అందిపుచ్చుకోవాల‌న్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అధ్య‌య‌నం  చేయ‌డం, వాటి ప‌రిష్కారానికి పోరాడ‌టం నాయ‌కుడికి ఉండాల్సి ల‌క్ష‌ణాల‌న్నారు. ఇంట్లో కూర్చొని పైర‌వీలు చేస్తే నాయ‌కులు కాలేర‌ని బాబు పార్టీ నాయ‌కుల‌కు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల్లో మ‌నం చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకుపోవ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యామ‌ని తెలిపారు. 


ఇక‌పోతే చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన దాదాపుగా రెండు ఏళ్లు పూర్తికావ‌స్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చేసింది ఏమీలేద‌ని జ‌గ‌మేరిగిన స‌త్యం. నిరుద్యోగం, రైతుల స‌మ‌స్య‌లు, రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా, రాజ‌దాని భూముల సేక‌ర‌ణ ఎక్క‌డి వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న చందంలా ఉంది. అంగ‌న్ వాడీ  వ‌ర్క‌ర్ల‌కు కార్మికుల‌కు ఇలా అన్ని వ‌ర్గాల‌కు ఇచ్చిన హామీల్లో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా నెర‌వేర్చ‌లేదు. కానీ చేసిందేమిటంటే.. పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వ‌హించామ‌ని చెప్పుకున్నారు. అందులో ఏర్పాట్ల కోసం ఖ‌ర్చు చేసింది వంద‌కోట్లు కూడా లేదు. కానీ అవి త‌ప్ప మిగ‌తా విష‌యాల కోసం 16 వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టారు. ఆ త‌రువాత బీద రాష్ట్రం కోసం రాజ‌ధాని క‌ట్టుకుందామంటూ చెప్పుకుంటూనే అమ‌రావ‌తి శంఖుస్థాప‌న పేరిట ప్రచారినికి వ‌చ్చే అతిధుల కోసం స్పెష‌ల్ ప్లైట్ ల పేరుతో చేసిన ఆర్భాటానికి వేల కోట్ల ఖ‌ర్చు పెట్టారు. చంద్ర‌బాబు. అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మ ఏర్పాట్లు కోసం చేసిన వేల కోట్లు ఖ‌ర్చుల‌తో ఇప్ప‌టికి కొన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు కూడా  సిద్ద‌మైపోయేవన్న విమ‌ర్శ‌ల‌ను కూడా ప‌ట్టించుకోలేదు ఏపీ చంద్ర‌బాబు. 


కానీ.. ప్ర‌చారం కోసం ఇంత ఖ‌ర్చు చేసిన తరువాత కూడా చేసింది చెప్పుఓలేక‌పోతున్నాం అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డ‌మేమిటో అంటున్నారు చంద్ర‌బాబు ప్ర‌త్య‌ర్థులు. రాజ‌ధాని కోస‌మంటూ  ప‌చ్చ‌ని పంట‌ల‌ను నాశ‌నం చేయ‌డం త‌ప్ప చంద్ర‌బాబు చేసిందేంటో చెప్పాల‌ని కూడా డిమాండ్ త‌లెత్తుతోంది. సరే ఇదిలా ఉంటే.. త‌న వైఫ‌ల్యాల‌ను ఎవ‌రి మీద రుద్దాలో ఆర్ధం కాక త‌న పార్టీ నేత‌ల‌పైనే నెడుతున్నార‌ని స్వంత పార్టీవారే అభిప్రాయ ప‌డుతున్నారు. ఇంత‌కీ ఉన్న‌ట్టుండి చంద్ర‌బాబు మ‌రోసారి ఇలా అంస‌తృప్తి ఎందుకు వ్య‌క్తం చేస్తున్నారా అంటూ నేత‌లు  చెవులు కొరుక్కుంటున్నారు. ఈ మ‌ధ్య రాజ‌ధాని శంకుస్థాప‌న త‌ప్ప వేరే కార్య‌క్ర‌మం గురించి మాట్లాడ‌నిది అయ‌నే.. వేరే ఏ ప‌నులూ లేన‌ట్టూ నాయ‌కులంద‌రినీ ఆ ప‌నుల్లోనే పుర‌మాయించి ఇప్పుడు ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కి ప్ర‌చారం చేయ‌డంలేద‌ని మమ్ముల‌ను అంటే ఎలా అని దేశం నాయ‌కులు గుస గుస లాడుతున్నారు.


చంద్ర‌బాబు ఇదే దిశానిర్దేశ సద‌స్సు లో చెప్పిన‌ట్లు ఎన్నిక‌ల‌ప్పుడు చూసుకుందాంలే అని ఇంట్లో కూర్చుంటున్న నేత‌ల‌పై  చంద్ర‌బాబు ఎందుకు చ‌ర్య తీసుకోవ‌డం లేద‌ని లోలోప‌ల ప్ర‌శ్నించుకుంటున్నార‌ట‌. పుష్క‌రాల ఏర్పాట్ల ద‌గ్గ‌ర నుంచి అమ‌రావ‌తి శంఖు స్థాప‌న వ‌ర‌కూ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు జ‌రిగింది చంద్ర‌బాబు ద‌గ్గ‌రి నేత‌లైన ఒక‌రిద్ద‌రు చేతుల్లోనే.. మ‌రి ప్ర‌భుత్వం చేప‌ట్టే కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌క‌పోవ‌డ‌మంటే అది ఆ దగ్గ‌రినేత‌ల పైఫ‌ల్య‌మే క‌దా! మ‌రి వారిపై చ‌ర్య‌లెందుకు తీసుకోవ‌డం లేద‌ని పార్టీలో కొంత మంది అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌. మొత్తం మీద‌ పాల‌న వైఫ‌ల్యాల‌ను పార్టీ నాయ‌కుల మీద రుద్దే ప్ర‌య‌త్నం చేశారు సీఎం చంద్ర‌బాబు. ఇదిలా ఉంటే.. బాబు ఇలా తేల్చాడేంటీ అంటు ప‌లువురు పార్టీ నాయ‌కులే కాకుండా సామాన్య జనం సైతం ఏపీ సీఎం చంద్ర‌బాబు పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: