దిల్‌సుఖ్ నగర్‌లో దారుణం జరిగింది.. పెద్ద పెద్ద కార్పోరేట్ స్కూల్స్ డొల్లతనం మరోసారి బయట పడింది. విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి మరోసారి రుజువైంది.  అందరితో హ్యాపీగా స్కూల్ కి వెళ్లిన చిన్నారి తిరిగిరాని లోకానికి వెళ్లిందని తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. వివరాల్లోకి వెళితే... దిల్‌సుఖ్ నగర్‌లోని ఓ ప్రయివేటు పాఠశాలలో జహానా ఫాతిమా అనే చిన్నారి ఉదయం ఎనిమిది గంటలకు పాఠశాలకు వచ్చింది..పై అంతస్తులోని తరగతి గదికి వెళ్లేందుకు తోటి విద్యార్థులతో కలసి లిఫ్టు ఎక్కింది.

అంతలోనే జహానా లిఫ్ట్ గ్యాప్‌లో ఇరుక్కుపోవడంతో ప్రాణాలు విడిచింది. క్షణాల్లో జరిగిన ఈ సంఘట చూసి అందరూ షాక్ తిన్నారు. అయితే లిఫ్టుల్లో వచ్చేప్పుడు చిన్న పిల్లలకు పెద్ద వాళ్ల తోడు ఉండాలి కానీ ఇక్కడ అది జరగలేదు. విషయం తెలిసిన తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో పడిన చిన్నారిని చూసి తీవ్రంగా రోదిస్తున్నారు. భారీ ఎత్తున ఫీజు వసూళ్లు చేయడంలో చూపిన శ్రద్ద స్కూల్ పిల్లలు ఎలా వస్తున్నారు ఎలా వెళుతున్నారు అన్న ద్యాస లేకుండా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అంటున్నారు.  


లిఫ్టులో చిక్కుకున్న చిన్నారి జహానా


పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ చిన్నారి చనిపోయిందని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. చిన్నారి తల లిఫ్ట్‌ డోరులో ఇరుక్కుపోవడంతో ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది.  లిఫ్ట్లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి జెహాన మరణించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ రవీందర్ చెప్పారు. స్కూల్ ప్రిన్సిపాల్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: