చంద్ర‌బాబు నాయుడు పాల‌న మొత్తం ఎమోష‌నల్ వైపే ఎక్కువ‌గా ఉంటుంది. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రాల ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న పాల‌న ప్ర‌జ‌ల పండ‌గ స‌మయాల్లో ప‌థ‌కాల‌ను ప్రారంభిస్తూ ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకునే ప్ర‌య‌త్నాలు చేసేవారు. ఇక చాలా రోజులుగా ప్ర‌తిప‌క్షంలో ఉంటూ వ‌చ్చిన చంద్ర‌బాబు, ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌నానంత‌రం ఏర్ప‌డ్డ న‌వ్యాంద్ర లో అనూహ్యంగా గెలిచి అధికారంలోకి వ‌చ్చారు. అప్ప‌ట్లో ఆయ‌న చేసిన ఎమోష‌నల్ పాలిటిక్స్ ల‌ను మ‌రోసారి ఏపీ ప్ర‌జ‌ల‌కు అప్లై చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను ఇంప్రెస్ చేయ‌డానికి సీఎం చంద్రాబాబు స‌ర్కార్ ప్ర‌జ‌ల ఎమోష‌న్స్ మీదే ఉంటోందే త‌ప్ప.. బాధ్య‌త‌ల‌పై ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. ప్ర‌జ‌ల‌పై ఉంటే బాధ్య‌తలు వేరు, అంతేక్ర‌మంలో ఎమోష‌న్స్ లు వేరు. ఓటు వేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌కు బాధ్య‌త‌తో వారి అవ‌స‌రాల‌ను తీర్చ‌డం బాధ్య‌త‌. 


చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు ఇంప్రెస్ చేయడానికి ఎమోష‌న‌ల్ 


ఎమోష‌న్స్ అంటే  ప్ర‌జ‌ల్లో దేవుడంటే ఒక ర‌క‌మైన న‌మ్మ‌కం ఉంటుంది. పండుగ‌లు వ‌చ్చాయంటే ప్ర‌జ‌లు అత్యంత ఉత్స‌హంగా జ‌రుపుకుంటారు. అంతేకాకుండా తెలుగు ప్ర‌జ‌లు పండ‌గ వాతావ‌రణాన్ని అమితంగా ప్రేమిస్తారు. అయితే.. ఈ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించిన చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు ఇంప్రెస్ చేయడానికి ఎమోష‌న‌ల్ లో ముడిప‌డి ఉండే అంశాల‌ను ఎంచుకుని ముందుకెళ్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అయితే ఈ క్ర‌మంలో ఆయ‌న ఏపీలో ఏ ప‌ని చేప‌ట్టినా పండ‌గ వాతావ‌ర‌ణాన్ని నెల‌కొల్పేవిధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. గ‌తంలో ఆయ‌న ఇలాంటి సంఘ‌ట‌న‌లే ఎక్కువ‌గా క‌లిసి వ‌చ్చాయి. ప్ర‌జ‌ల‌కు ఎక్కువ శాతం పండ‌గ రోజుల్లో ఆయ‌న ప‌థ‌కాల‌ను మొద‌లుపెట్టేవారు. పండ‌గ‌లకు ప్ర‌భుత్వం స్పెష‌ల్ ఆప‌ర్లంటూ ప్ర‌క‌టించేవారు. తాజాగా ఇదే ప‌రిస్థితిని అనుస‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌పోతే తాజాగా ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఎక్కువ‌గా ఎమోష‌నల్ గా ఉంటే కార్య‌క్ర‌మాలే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తు వ‌స్తున్నారు.


తాజాగా ఆయ‌న‌కు ఎమోష‌న‌ల్ కు సంబంధించి కార్య‌క్ర‌మాలే వ‌రుసగా వ‌స్తున్నాయి. గ‌త కొన్ని నెల‌ల క్రితం గోదావ‌రి మ‌హాపుష్క‌రాలను నిర్వ‌హించారు. అయితే ఇది కొంత వ‌ర‌కు ఆయ‌న పాల‌న కు మైన‌స్ గా మారినా.. దానిని క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. గోదావ‌రి పుష్క‌రాలకు ఆయ‌న పూర్త స్థాయిలో కాకుండా ప్ర‌జ‌ల‌కు కొంత వ‌రకు ద‌గ్గ‌ర‌య్యార‌నే చెప్పాలి. ఇక‌పోతే.. న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని కూడా ఎమోష‌నల్ గానే చేశారు. ఏపీ ప్ర‌జ‌ల దృష్టి ఇత‌ర అంశాల‌పై వెళ్ల‌కుండా.. మ‌న నీరు, మ‌న మ‌ట్టి, మ‌న రాజ‌ధాని, అమ‌రావ‌తి ప‌విత్ర భూమి అంటూ, దేవ‌త‌ల దీవెన‌లు ఉన్న ప్రాంతం అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా రాజ‌ధాని నిర్మాణానికి కావ‌ల‌సిన భూమిని ఇచ్చిన రైతుల‌కు, అమ‌రావ‌తి లో ఉన్న ప్ర‌జ‌ల‌కు ప‌ట్టు చీర‌, ప‌ట్టు దొవ‌తి లు పంపిణి చేశారు. ఏపీ లో ఆయా ప్రాంతాల నుంచి వ‌చ్చే ప్ర‌జ‌ల‌ను త‌మ జిల్లా మట్టిని తీసుకుని రావాల‌సిందిగా తెలిపారు. దీంతో ప్ర‌జ‌లు ఒక్క‌సారి ఒక ర‌క‌మైన భావోద్వేకత‌కు లోన‌య్యారు. ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సంతా రాజ‌ధాని వైపే ఉండేలా చేయ‌డంలో చంద్ర‌బాబు స‌ఫ‌ల‌మైన‌ట్టు గా చెప్ప‌వ‌చ్చు. 


ఇక మ‌రో రెండు నెల‌ల్లో సంక్రాంతి పండుగ రానుంది. ఆంధ్ర ప్ర‌దేశ్ లో సంక్రాంతి పండుగ చాలా పెద్ద‌దిగా చెప్ప‌వచ్చు. దాదాపు నాలుగు రోజుల పాటు జ‌రిగే ఈ పండుగ‌కు తెలుగు ప్ర‌జ‌లు చాలా భ‌క్తి భావాల‌తో జరుపుకుంటారు. వారి వారి కుల పెద్ద‌ల‌ను త‌ల‌చుకోవ‌డం, ఇష్ట‌దైవం, కుల దైవాల‌ను త‌ల‌చుకుంటూ పూజ‌లు నిర్వ‌హిస్తారు. వారికి ఇష్ట‌మైన పిండివంట‌కాలు త‌యారు చేసుకుని, కుటుంబ స‌భ్యులంతా  ఎంతో అనోన్య‌త‌తో ఈ నాలుగు రోజులు గ‌డుపుతారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఇది కూడా మంచి సంద‌ర్భమే న‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఏడాది కాలంలో చేప‌ట్టిన కార్యక్ర‌మాన్ని వెలుగులోకి  తెచేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఏపీ ప్ర‌జ‌ల‌కు సంక్రాంతి కానుకగా ప్ర‌తి ఇంటికి కావల‌సిన నిత్యావ‌స‌ర వస్తువుల‌ను ప్యాక్  చేసి ఇచ్చేందుకు ప్ర‌భుత్వం చర్యలు చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇక వ‌స్తువుల‌ను ఇచ్చే బ్యాగ్ ల‌పై తెలుగుదేశం పార్టీ చిహ్నాం, చంద్ర‌బాబు ఫోటో ల‌ను ముద్ర‌వేసి  ప్ర‌జ‌ల‌కు అందించ‌నున్నారు.   


అయితే చంద్ర‌బాబు ఇచ్చే వ‌స్తువులు ఆయ‌న సొంత డ‌బ్బుల‌తో ఇస్తున్నారా అంటే అదిలేదు. ప్ర‌జా ధ‌నం తోనే ఆయ‌న ప్ర‌జ‌ల‌కు కానుక‌గా ఇస్తున్నారు. కాక‌పోతే అది నేనే ఇస్తున్న సంక్రాంతి కానుకని ప్ర‌చారం చేయాల‌న్న‌దే ఏపీ సీఎం ల‌క్ష్యం. ఇక‌పోతే గతేడాది సంక్రాంతి స‌మ‌యంలో చంద్ర‌బాబు భారీ మొత్తంలో ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు చేసి క‌ల‌రింగే ఇచ్చుకున్నారు. అప్ప‌ట్టో దీని పై చాలా విమ‌ర్శ‌లే వ‌చ్చాయి. ప్ర‌తి ఏడాది ఏపీ ప్ర‌జ‌ల‌కు వ‌చ్చే పెద్ద, గొప్ప పండుగ‌గా జ‌రుపుకునే సంక్రాంతి ని తెలుగు దేశం పార్టీ అన‌వ‌స‌రంగా రాజ‌కీయం చేసి.. పండుగ వాతావ‌ర‌ణంలో జ‌రుపుకునే ప‌రిస్థితిని లేకుండా చేస్తుంద‌ని ప్ర‌తిప‌క్ష‌నాయకులు తీవ్రంగానే విమ‌ర్శిస్తున్నారు. చంద్ర‌బాబు కానుక‌లు అధికార పార్టీ  అండ ఉన్న వారికే ద‌క్కాయ‌ని, ఇత‌ర పార్టీల వారికి అంద‌క‌పోవ‌డం వంటివి చాలా చోట్ల జ‌రిగాయన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. వీటి కోసం రూ.300 కోట్లు ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేశార‌న్న వార్త‌లు ఉన్నాయి. 


అయితే ప్ర‌జ‌ల సొమ్మును ప్ర‌జ‌ల‌కోసం ఖ‌ర్చు చేయ‌డం కూడా ప్ర‌జ‌ల‌కు చేస్తున్న మేలుగా ప్ర‌భుత్వాలు చెప్పుకుంటున్నారు. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయ‌డం పాల‌క ప‌క్షం బాధ్య‌త‌. పాల‌క ఫ‌క్షాన్ని నిల‌దీసి ప‌నిచేయించడం ప్ర‌తిప‌క్షాల‌ బాధ్య‌త‌. అదేదో మేమే ప్ర‌జ‌ల‌కు ఇస్తున్నామ‌ని .. ప్ర‌జ‌ల‌మీద క‌పట ప్రేమ వల్లించాల్సిన అవ‌ర‌సరం పాల‌క ప‌క్షానికి ఉండ‌కూడ‌దు. ఎదో పండ‌గ‌లు వ‌స్తున్నాయి క‌దా అని అప్ప‌టికప్పుడు కొంత వ‌ర‌కు సహాయం చేసి..చేతులు దులుపుకంటే ఏం లాభం. గ‌తంలో చంద్ర‌బాబు కు ఇలాంటి ప‌రిస్థితుల‌తోనే  ఎదురు దెబ్బ‌లు తీసి ప్ర‌తిప‌క్షంలో ఉండాల్సి వ‌చ్చింది. తాజాగా అదే సిద్దాంతాన్ని అవ‌లంభిస్తున్నారు ఏపీ సీఎం.  ప్ర‌జ‌లు త‌న సొంత కాళ్ల‌పై నిల‌బ‌డే విధంగా అధికార ప‌క్షం అడుగులు వేయాలి త‌ప్ప, ప్ర‌జ‌ల ఎమోష‌న‌ల్ లతో రాజకీయాలు చేస్తే..స‌మ‌యం చూసి ప్ర‌జ‌లే వారికి బుద్ది చెప్పుతారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: