కొన్నాళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్తబ్దుగా ఉంది.. ఇది నిన్నటి మాట.. కానీ ఇప్పుడు సీన్ మారుతోందట. తెలంగాణ ఏర్పాటు పూర్తికావడం.. క్రమంగా మెరుగైన పరిస్థితులు ఏర్పడటం.. హైదరాబాద్ అభివృద్ధిపై నమ్మకం మొదలైన అంశాల కారణంగా మళ్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకుంటోందట. గతేడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ ఆదాయం పెరగడమే ఇందుకు ఉదాహరణగా కనిపిస్తోంది. 

నగరంలో కంటే ఈ పెరుగుదల శివార్లలో ఎక్కువగా


గత ఏడాది అక్టోబర్ లో 26 కోట్ల రూపాయల ఆదాయం రిజస్ట్రేషన్ ల ద్వారా వస్తే..  ఈ ఏడాది అక్టోబర్ లో అది 36 కోట్లకు పెరిగింది. ఒక్క నెలలో దాదాపు 10 కోట్ల రూపాయల అభివృద్ధి అంటే మాటలు కాదు. ఒక్క ఆదాయంలోనే కాదు.. రిజిస్ట్రేషన్ల సంఖ్యలోనూ పెరుగదల కనిపించింది. గతేడాది కన్నా 1300 వరకు రిజిస్ట్రేషన్లు పెరిగాయట. నగరంలో కంటే ఈ పెరుగుదల శివార్లలో ఎక్కువగా ఉందట. 

ఐతే.. ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏపీ రాజధాని ప్రాంతంలో కనిపిస్తోంది. రాజధాని ప్రకటనతోనే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. ఒక దశలో ఎకరం 5 కోట్ల వరకూ కూడా పలికిందని సమాచారం. కానీ ప్రస్తుతం అక్కడ అంత జోష్ కనిపించడం లేదు. రాజధాని ప్రకటించిన మొదట్లో కనిపించినంత రియల్ బూమ్ ప్రస్తుతం లేదు. 

రాజధాని ప్రకటనతో హైదరాబాద్ మార్కెట్ నుంచి అమరావతి మార్కెట్ వైపు చూసిన రియల్ వ్యాపారులు.. ప్రస్తుతం మళ్లీ హైదరాబాద్ వైపుకే మళ్లుతున్నారన్న వాదన కూడా ఉంది. ఐతే.. అమరావతి ప్రాంతంలో రియల్ భూమ్ కాస్త తగ్గడానికి వేచి చూసే ధోరణే కారణమని తెలుస్తోంది. అమరావతి మాస్టర్ ప్లాన్ పూర్తిగా ఖరారు కావడం, జనవరిలో భూములిచ్చిన రైతులకు ప్లాట్ల అప్పగింత అయిన తర్వాత అక్కడ మళ్లీ బూమ్ కనిపించే అవకాశం ఉందంటున్నారు రియల్ మార్కెట్ విశ్లేషకులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: