భారత దేశంలో విద్యావ్యవస్థకు ఎంతో గౌరవప్రధమైన స్థానం ఉంది.  తల్లిదండ్రులు పిల్లలను కన్నతర్వాత అంతే బాధ్యతతో గురువు వద్దకు పిల్లను పంపుతారు...తమ పిల్లల భవిష్యత్ ను వారి చేతిలో పెడుతారు. అనాధిగా వస్తున్న ఆచారమే ఇది..తల్లిదండ్రుల తర్వాత పూజ్యనీయులు గురువులే..  గురువును దేవుడితో సమానంగా పూజిస్తారు. కానీ ఈ మద్య గురువులు తమ గురువు స్థానానికి మచ్చ తెస్తున్నారు. కన్నబిడ్డల్లా చూడాల్సిన విద్యార్థులను వక్ర బుద్దితో చూస్తున్నారు. కామంతో కళ్లు గప్పిన కొందరు కీచక ఉపాధ్యాయులు విద్యార్థులపై లైంగిక దాడులకు పాల్పపడుతున్నారు. ఇప్పటి దేశంలో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి.

తాజాగా తమిళనాడులో పుదుకొట్టై జిల్లాలో నమన సముత్తిరంన్నీర్ పట్టణంలో గల ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో రవిచంద్రన్ (50), పొన్నారసన్ (45) అనే ఇద్దరు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. అయితే వీరి వంకర బుద్దితో ఇద్దరు విద్యార్థునులపై లైంగిక దాడులకు పాల్పపడసాగారు. భాదిత విద్యార్థినుల్లో ఒకరు తొమ్మిదవ తరగతి చదువుతుండగా, మరోకరు పదో తరగతి అభ్యసిస్తున్నారు. వీరిని భయపెడుతూ తమ కోరిక తీర్చమని బలవంత పెట్ట సాగారు. అయితే సహనం నశించిన ఆ విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పారు.

దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి పిర్యాదు చేశారు. అయితే వారి ముందు ఉపాధ్యాయులను పిలిచి ప్రశ్నించగా, తాము ఎలాంటి తప్పు చేయలేదని మంచి మార్కులు తెచ్చుకోవాలని ప్రత్యేకంగా చెప్పామని బుకాయించారు. ఆ మాలటకు సంతృప్తి పడని తల్లిదండ్రులు  పాఠశాలు ఎదురుగా ధర్నా నిర్వహించి.. రాస్తారోకో చేయడంతో పాఠశాల కమిటీ సభ్యులు భేటీ అయిన తర్వాత  ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: