సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్(92) అస్వస్థత కన్ను మూశారు.  పక్షవాతంతో బాధ పడుతున్న బర్దన్ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బర్దన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుందని సీపీఐ నేత ఒకరు తెలిపారు.  గుండెపోటుతో ఉదయం 8 గంటల నుండి స్పృహలో లేని బర్దన్ ను జీబీ పంత్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స అందించారు.అయితే చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో తుదిశ్వాస విడిచారు. 


గత కొద్ది రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న బర్దన్ చికిత్స పొందుతున్నారు.  ఐసీయులో ఉంచి ఆయనకు చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మరణించారని వైద్యులు దృవీకరించారు. బెంగాల్ కు చెందిన బర్దన్ పూర్తి పేరు ఆర్దేందు భూషణ్ బర్ధన్. 1996 నుండి ఆయన సీపీఐ ప్రధాన కారదర్శిగా పనిచేశారు. బెంగాల్ లోని బరిసల్ అనే ప్రాంతంలో 1924 సెప్టెంబర్ 24న బర్దన్ జన్మించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: