గురువారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశంలో  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సంచలన రేకెత్తిస్తున్న కాల్ మనీ వ్యవహాం ప్రధాన చర్చగా సాగుతుంది. అధికార పక్షం వారిని ఎక్కడ ఇబ్బందుల్లో పెట్టాలని చూస్తున్న ప్రతిపక్షానికి ఇదొక ఆయుధంగా మారింది. దీతో సభ మొదలైనప్పటి నుంచి ప్రతిపక్షాల ఆరోపణలతో హౌస్ దద్దరిల్లిపోయింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఇతర వైసీపీ సభ్యులు కాల్ మనీ వ్యవహారంపై అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా స్పీకర్ కోడెల శివ ప్రసాద్ దాన్ని తిరస్కరించారు.

అయితే ఇది ఒక్కరి సమస్య కాదని ఈ స్కామ్ వల్ల ఎంతో మంది మహళలలు ఆందోళన చెందుతున్నారని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన అన్నారు. అంతే కాదు ప్రతిపక్ష నేత జగన్, ఇతర నేతలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను 10 నిముషాలు వాయిదా వేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైన సమావేశంలో కూడా ప్రతిపక్షాలు కాల్ మనీ పై చర్చ జరపాలని పట్టుపడుతూ సభలో తీవ్ర గందరగోళం సృష్టించాయి.  

ఏపీ అసెంబ్లీ


ఇకపోతే టీడీపీ నేతలు వైసీపీ నేతల మద్య ఆరోపణల పర్వం కొనసాగింది. అంతే కాదు ప్రతి పక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని నిర్లక్ష్యం చేసి అంబేడ్కర్ ని అవమానిస్తున్నారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు సభ ఒకసారి వాయిదా పడ్డా కూడా ఎమ్మెల్యేల ఆందోళన ఆపకపోవడంపై స్పీకర్ కోడెల వారిని మందలించారు. అయినప్పటికీ వైసీపీ నేతలు చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టడంతో స్పీకర్ మరోసారి సభను 10 నిముషాలు వాయిదా వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: