భారతే దేశంలో ఇప్పుటి వరకు అందరి చూపు ఒకే వైపు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నకాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆమె తనయుడు రాహుల్ గాంధీ లకు బెయిల్ వస్తుందా..? రాదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది..అయితే దీనికి తెర పడింది. సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు బెయిల్ మంజూరైంది.  సోనియా, రాహుల్ గాంధీల తరుపున మాజీ ప్రధాని మన్మోసింగ్, అహ్మాద్ పటేల్ బెయిల్ పత్రాలు సమర్పించారు.



పాటియాలో కోర్టులో నేషనల్ హెరాల్డ్ కేసును విచారించిన రెండో మెట్రోపాలిటన్ జడ్జి లవ్లీసింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా, రాహుల్‌కు 50వేల పూచీకత్తుతో బెయిల్ మంజారు చేశారు.  సోనియా, రాహుల్‌లకు బెయిల్ ఇవ్వొద్దని పిటిషనర్ సుబ్రమణ్యస్వామి వాదించారు. శ్యామ్ పిట్రోడాపై నాన్ బెయిల్ వారెంట్ జారీ చేయాలని స్వామి కోరగా, మేజిస్ట్రేట్ అందుకు నిరాకరిస్తూ బెయిల్ మంజూరు చేశారు. మరోపక్క సోనియా, రాహుల్‌గాంధీలకు బెయిల్‌ ఇవ్వడాన్ని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వ్యతిరేకించిన విషయం తెలిసిందే.



కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయన సోదరి ప్రియాంక బెయిల్ బాండ్లను సమర్పించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లకు ఎలాంటి షరతులు లేని బెయిల్‌ను పాటియాలా కోర్టు మంజారు చేసింది. ఈ కేసు రెండో విచారణను ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసు విచారణను కేవలం 3 నిమిషాల్లోనే ముగియడం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: