కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ కావూరి సాంబశివరావు ఇక కాంగ్రెస్ పార్టీకి దూరమైనట్లుగానే భావించాల్సి ఉంది. పిసిసి సమన్వయకమిటీ సమావేశానికి డుమ్మాకొట్టిన కావూరి కాంగ్రెస్ లో కొనసాగడం కోసం సిద్దంగా లేనట్లు తెలుస్తంది. ఎలూరు కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా 5సార్లు గెలుపొందినటువంటి కావూరి గత కొంతకాలంగా అలకపాన్పు ఎక్కారు. కాగా కావూరిని బుజ్జగించేందుకు అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తాను ఇక కాంగ్రెస్ పార్టీకి దూరమైనట్లుగానే భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ముద్రపడిన కావూరికి ఇటీవల విస్తరించిన కేంద్రమంత్రివర్గంలో ఆయనకు మంత్రి పదవిలో చోటు దక్కలేదు. దీంతో అప్పటినుండి కాంగ్రెస్ పార్టీపై సీరియస్ గా ఉండి ఎంపీ పదవికి రాజీనామచేశారు. కాగా తన రాజీనామాను అమోదించకుండా బుజ్జగించేందుకు అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు ప్రధానమంత్రి స్వయంగా ఫోన్ లో మాట్లాడి రాజీనామాను వెనుక్కీ తీసుకోవాలని చెప్పిన వికకుండా తనవైఖరిలో మార్పు తెచ్చుకోలేదు. 90సంవత్సరాలుగా తన కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా తమకు అధిష్టానం ఇచ్చేటువంటి గౌరవం ఇదా అని కావూరి ప్రశ్నిస్తున్నారు. పార్టీలు మారిన వారిని, పిఆర్పీనుండి వచ్చిన వారికి మంత్రులుగా అవకాశం కల్పించి తమలాంటి వారికి అన్యాయం చేయడం సహించరానిదని కావూరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్ని కొంతకారణం కాగా తన కుమారుడు కావూరి బాస్కర్ రావు రాజకీయాల్లో కొనసాగుతుండగా అతనికి అడ్డురావద్దని కావూరి సాంబశివరావు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో సీమాంద్రలో వైకాపా హవా కొనసాగుతుండగా సాంబశివరావు కుమారుడు బాస్కర్ రావు కొంత కాలంగా వైకాపాలో చురుగ్గా కొనసాగుతున్నాడు. కాగా ఇటువంటి పరిస్థితిలో తండ్రి కొడుకు వేర్వేరుపార్టీల్లో ఉండడంతో ప్రజలు అయోమయానికి గురయ్యే అవకాశం ఉన్నందున కుమారుడికి అడ్డుపడకుంటే వైకాపాలో ఎంపి టిక్కెట్ ఇచ్చే అవకాశమున్నందున ఇకనుండి కావూరి కాంగ్రెస్ పార్టీకి శాశ్వతంగా దూరం కానున్నట్లుగా తెలుస్తంది.

మరింత సమాచారం తెలుసుకోండి: