చంద్రబాబులో ఇంత మార్పు ఎలా వచ్చిందో?

తన నీడను తాను నమ్మలేని రాజకీయ నేతల్లో దేశంలోనే నెంబర్ వన్ నేతగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గుర్తింపు ఉండేది. తనమీద పడిన ముద్రకు తగ్గట్టుగా గతంలో చంద్రబాబు తన కుటుంబ సభ్యులను ఎవ్వరినీ పార్టీ కార్యకలాపాల్లోకి కానీ, పాలనా వ్యవహారాల్లోకి కాని ససేమిరా రానిచ్చేవారు కాదు. పైగా చంద్రగిరి నియోజకవర్గంలో చురుకుగా ఎదుగుతున్న సోదరుడు నారా రామ్మూర్తి నాయుడికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసిన ఘనత కూడా చంద్రబాబే దక్కించుకున్నారు.

 

అలాంటి బాబు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతగా మారిపోయారని తెలిసన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. వీఐపీల దృష్టిలో తన కుటుంబ సభ్యులు గుర్తింపు పొందడానికి దొరికిన ప్రతి అవకాశాన్నీ చంద్రబాబు ఇప్పుడు అందిపుచ్చుకుంటున్నారు. ఆ వీఐపీ ప్రధాని నరేంద్రమోదీ కావచ్చు. తాజాగా మైక్రోసాఫ్ట సీఈఓ సత్యనాదెండ్ల కావచ్చు తన కుటుంబ ప్రమోషన్‌కు ఇంతటి ప్రముఖ వ్యక్తులను కూడా చంద్రబాబు ముగ్గులో దింపగలుగుతుండటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

 

ఏపీ ముఖ్యమంత్రిగా తనను కలుస్తున్న ముఖ్య అతిధుల వద్దకు తన కుటుంబ సబ్యులందరినీ తీసుకుపోవడంలో చంద్రబాబు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నారు. చివరకు మనవడు, లోకేష కుమారుడు అయిన చిన్నారి దేవాంష్‌ను కూడా వీఐపీల ముందు ప్రదర్శనకు పెట్టడంలో చంద్రబాబు రూటే అనేంతంగా పరిస్తితి మారిపోయింది.

 

సోమవారం మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్లను బ్రేక్ ఫాస్ట్‌కు తన ఇంటికి ఆహ్వానించిన చంద్రబాబు నాదెళ్లతో వ్యాపార విషయాలను చర్చించారు. కాని అదే సమయంలో తన కుటుంబ సభ్యులందరూ ఆ సమావేశానికి హాజరయ్యేలా చంద్రబాబు జాగ్రత్తపడ్డారు. ఎప్పటిలాగే బాబు కుటుంబ సభ్యుల్లో స్టార్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఆయన మనవడు దేవాంషే నిలిచాడు.

 

అతిధులకు తన మనవడిని పరిచయం చేయడం ఒక రొటీన్‌గా చంద్రబాబు మార్చడంతో మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదెళ్లకు కూడా దేవాంష్‌ను ఎత్తుకుని ముద్దాడక తప్పింది కాదు. చివరకు సత్యనాదెళ్ల తన మనవడిని ఎత్తుకున్న ఫొటోను కూడా అఘమేఘాల మీద చంద్రబాబు కుటుంబం అఘమేఘాల మీద మీడియాకు ఇచ్చి ప్రచారం చేసేసుకుంది. పైగా దేవాంష్ మైక్రోసాఫ్ట్ సీఈఓతో అత్యంత సౌకర్యంకా గడిపేశాడు. నాదెళ్ల కూడా దేవాంష్‌తో సరదాగా గడిపారు అని చంద్రబాబు తనయుడు లోకేష్ ట్వీట్ చేశారు.

 

ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా బాబు తన మనవడిని పరిచయం చేశారు. మోదీ కూడా దేవాంష్‌ని తన చేతుల్లోకి తీసుకుని తన కళ్లద్దాలను అతడి కళ్లలో ఉంచారు. అది కూడా మీడియాకు చక్కటి ఫొటోగా మారిపోయింది.

 

కుటుంబాన్ని, బంధువులను పూర్తిగా దూరం పెట్టినా, ఇప్పుడు తన సొంత కుటుంబాన్ని ప్రభుత్వం తరపున జరుగుతున్న ప్రతి పెద్ధ కార్యక్రమంలోనూ ప్రమోట్ చేస్తూ ఉన్నా బాబు రూటే వేరు అని పరిశీలకులు చెప్పుకుంటున్నారు. పబ్లిక్ స్ట్రాటజీ విషయంలో చంద్రబాబును మించిన వారు లేరు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: