అమెరికా లో వరుస మారణ హోమలకు ఎప్పుడు అడ్డుకట్ట వేస్తారో తెలియట్లేదు.తాజాగా కనెక్టికట్‌లో ఓ ప్రాథమిక పాఠశాలలో ఉన్మాది శుక్రవారం విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో మొత్తం 28 మంది మరణించినట్లు తేలింది. మృతుల్లో 20 మంది చిన్నారులే. ఆ ఉన్మాదిని 20 ఏళ్ల ఆడమ్ లాంజా గా గుర్తించారు. ఈ 28 మందిలో తనను తాను కాల్చుకున్న ఉన్మాది, అతడి తల్లితో కూడా ఉన్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం కనెక్టికట్‌లోని పాశవికంగా తన ఇంట్లో తల్లిని కాల్చి చంపిన అనంతరం ఆడమ్ న్యూటౌన్‌లోని ఎలిమెంటరీ పాఠశాలకొచ్చి అక్కడి పిల్లలపై కాల్పులు జరిపాడు. మృతుల్లో ఐదు నుంచి పదేళ్ల లోపు వయసున్న 20 మంది చిన్నారులున్నారు. ఆడమ్‌ను అడ్డుకోవడానికి, పిల్లలను రక్షించడానికి యత్నించిన పాఠశాల ప్రిన్సిపల్ ను, మరో సైకాలజిస్టును కూడా అతడు కాల్చి చంపేశాడు.ఆడమ్ ఎప్పు డూ ఒంటరిగా ఉండే మనిషని, ఎవరితోనూ మాట్లాడడని, తరచూ ఉద్వేగానికి లోనవుతుంటాడని స్నేహితులు, చుట్టుపక్కలవారు తెలిపినట్లు తెలుస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: