దేశంలో రోజు రోజు కి ఈజీ మనీ కోసం కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పపడుతున్నారు. దీనికి కోసం ఎన్ని అడ్డదారుల్లో వెళ్లాలో వెళ్తున్నారు..అంతే ముఖ్యంగా డబ్బు సంపాదనలో దొంగ నోట్ల చెలామని బాగా సాగిస్తున్నారు. అంతే కాదు బ్లాక్‌మనీ, మనీలాండరింగ్ విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఈ వ్యవహారాలకు అడ్డు కట్ట వేయాలని  కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది.  

ఇప్పటికే దొంగ నోట్ల వ్యవహారం, బ్లాక్‌మనీ, మనీలాండరింగ్ ఎన్నికఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కొందరు లూప్ లైన్లు వెతుక్కుంటూ తమ దందాలు సాగిస్తున్నారు. హోటల్ బిల్లు లేదా విదేశీయాన విమాన టిక్కెట్టు కొనుగోలు కోసమైనా రూ. 50 వేలు నగదు చెల్లింపులకు తప్పనిసరిగా పాన్ కార్డు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జనధన్ అకౌంట్లకు మినహాయించి బ్యాంక్ ఖాతా తెరవాలంటే పాన్‌కార్డును కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి రానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: