కొత్త సంవత్సరం.. కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ. భవిష్యత్తుపై ఆశతో సానుకూల దృక్పథంతో అంతా జరుపుకునే కాల ఉత్సవం. అందుకే న్యూఇయర్ పార్టీకి అంత క్రేజ్.. ఇక మందుబాబుల సంగతి చెప్పనక్కర్లేదు. మందు బాటిల్ ఖాళీ చేయకపోతే వాళ్లకు న్యూఇయర్ పార్టీ చేసుకున్నట్టే ఉండదు.   

అందుకేనేమో.. ఈ ఏడాది కూడా న్యూఇయర్ పార్టీల్లో మద్యం ఏరులై పారింది. నూతన సంవత్సర వేడుకలు తెలుగు ప్రభుత్వాల ఖజానాకు కళ తెచ్చాయి. డిసెంబరు 31 రాత్రి ఒక్క తెలంగాణలోనే 136 కోట్ల రూపాయల మద్యం అమ్ముడు పోయింది. బీర్లు, మద్యం కలిపి ఒక్క రాత్రే 30 లక్షల మందు సీసాలు అమ్ముడు పోయాయట.

సాధారణ రోజులతో పోలిస్తే మందు విక్రయాలు హైదరాబాద్ లో ఆరు రెట్లు.. మిగిలిన జిల్లాల్లో మూడింతలు పెరిగి పోయాయాట.  హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో  150 వరకూ ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించారట. అర్థరాత్రి వరకూ మద్యం విక్రయాలకు అనుమతినివ్వడం వల్ల మందు ఏరులై పారింది.

మామూలుగా హైదరాబాద్ లో ప్రతీ రోజూ సుమరు 13 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందట. ఇతర జిల్లాలన్నీ కలిపి దాదాపు 20 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగుతాయి. కానీ డిసెంబర్ 31 రాత్రి..  ఒక్క హైదరాబాద్ లోనే 75 కోట్లకు పైగా మద్యం అమ్ముడు పోయింది. అటు ఆంధ్రాలోనూ జోరుగానే తాగేశారట. అక్కడ మొత్తం 60 కోట్ల మందు ఒక్క రాత్రే అమ్ముడు పోయిందట. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల రూపాయల మందు తాగేసారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: